Ayodhya Buffalo | ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) అయోధ్య( Ayodhya )లోని మోద్ర కర్మ చౌరహా గ్రామానికి చెందిన ఓ రైతు( Farmer ) బర్రెలను పెంచుకుంటున్నాడు. అయితే అందులో ఒక బర్రె( Buffalo ).. ఇటీవలే ఓ దూడ( Calf )కు జన్మనిచ్చింది. ఆ దూడ సాధారణంగా నాలుగు కాళ్లతో జన్మించలేదు. అసాధారణంగా ఎనిమిది కాళ్ల( 8 Legs )తో జన్మించింది. దీంతో ఆ బర్రె దూడ( Buffalo Calf )ను చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక బర్రె దూడను ఫొటోలు తీసి స్థానికులు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్( Veterinary Doctor ) రామ్ కిశోర్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన పరిణామం అని తెలిపారు. ఇండియా( India )లో బర్రె దూడలు ఇలా జన్మించడం అసాధారణం అని పేర్కొన్నారు. అయితే ఈ బర్రె దూడ ఆడనా, మగనా అనేది నిర్ధారించడం చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ఇలా జన్మించిన దూడలు ఎక్కువ కాలం బతకలేవు. సాధ్యమైనంత వరకు ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ కిశోర్ యాదవ్ పేర్కొన్నారు.
ఇక ఈ దూడను చూసిన వారిలో కొందరు.. దాన్ని దైవంగా భావిస్తున్నారు. మరికొందరేమో ప్రకృతి ప్రకోపం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 8 కాళ్లతో జన్మించిన దూడ బతకాలని రైతు కుటుంబం ప్రార్థిస్తుంది.