Wi vs India | తొలి టీ20లో భార‌త్ ఓట‌మి

Wi vs India | త‌రౌబా: వెస్టిండీస్‌తో మొద‌లైన 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. నేటి మ్యాచ్‌లో భార‌త్ 4 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. 150 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించ‌లేక భార‌త అతిర‌థ‌మ‌హార‌థ‌లంద‌రూ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. భార‌త్ త‌ర‌పున అరంగేట్రం చేసిన హైద‌రాబాదీ తిల‌క్‌వ‌ర్మ ఒక్క‌డే అత్య‌ధికంగా 39 ప‌రుగులు చేసాడు. భార‌త ఓపెన‌ర్లు త‌క్కువ స్కోర్‌కే వెన‌క్కితిరిగినా, సూర్య (21), పాండ్యా(19) కాసేపు నిల‌బ‌డ్డారు […]

  • Publish Date - August 3, 2023 / 07:08 PM IST

Wi vs India |

త‌రౌబా: వెస్టిండీస్‌తో మొద‌లైన 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. నేటి మ్యాచ్‌లో భార‌త్ 4 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. 150 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించ‌లేక భార‌త అతిర‌థ‌మ‌హార‌థ‌లంద‌రూ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు.

భార‌త్ త‌ర‌పున అరంగేట్రం చేసిన హైద‌రాబాదీ తిల‌క్‌వ‌ర్మ ఒక్క‌డే అత్య‌ధికంగా 39 ప‌రుగులు చేసాడు. భార‌త ఓపెన‌ర్లు త‌క్కువ స్కోర్‌కే వెన‌క్కితిరిగినా, సూర్య (21), పాండ్యా(19) కాసేపు నిల‌బ‌డ్డారు కానీ, ఓటమి నుంచి కాపాడ‌లేక‌ పోయారు. ఐపిఎల్‌లో విచ్చ‌ల‌విడిగా ప‌రుగులు చేసిన ఈ బ్యాట‌ర్లు ఈరోజు పూర్తిగా తేలిపోయారు. దాంతో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 145 ప‌రుగులు చేసి ప‌రాజ‌యం పాలైంది.

టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి149 ప‌రుగులు చేసింది. నికొల‌స్ పూర‌న్ (41), పావెల్ (48), కింగ్ (28) రాణించారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ 2 వికెట్లు, అర్ష‌దీప్ 2, కుల్‌దీప్‌, పాండ్యా చెరొక వికెట్ సాధించారు.

Latest News