Site icon vidhaatha

MS Dhoni | మిస్టర్‌ కూల్‌ ధోనీకి మళ్లీ కొపమొచ్చింది..! కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని హెచ్చరిక..!

MS Dhoni | మైదానంలోకి అడుగుపెట్టాడంటే.. ఎంతో ప్రశాంతంగా ఉంటూ మిస్టర్‌ కూల్‌గా అందరి ప్రశంసలు పొందాడు టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని. అరుదైన సందర్భంలో మాత్రమే ధోని ఆగ్రహానికి గురికావడం చూసుంటాం.

తాజాగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసినా.. బౌలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. దాదాపు నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో చెన్సై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ఆడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే భారీ పరుగుల లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచింది. ఈ మ్యాచ్‌లో ఓ దశలో మ్యాచ్ ఓడిపోతుందేమో అందురూ భావించారు. చివరకు మాత్రమే ధోనీసేన విజయం సాధించింది. మ్యాచ్‌లో జట్టు విజయం సాధించిన ధోని మోములో ఏమాత్రం సంతోషం కనిపించలేదు.

ఈ సందర్భంగా జట్టు సభ్యులపై ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ అంశం వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు.. వివరాల్లోకి వెళితే.. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని అందరూ భావించారు. చివరి ఓవర్లలో టపాటపా వికెట్లు పడడంతో ఓటమిపాలైంది. చివరి బంతి వరకు పోరాడి 205 పరుగులకు మాత్రమే పరిమితమైంది.

ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు వైడ్స్, నోబాల్స్ ఎక్కువగానే సమర్పించుకున్నారు. లేకపోతే చెన్నై మరింత తేడాతోనే గెలుపొందేది. ఇదే విషయంపై ధోనీ బౌలర్లను హెచ్చరించాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయడం నేర్చుకోవాలని సూచించాడు.

ప్రత్యర్థి జట్ల బౌలర్లు ఏం చేస్తున్నారో గమనించాలని చెప్పాడు. చెప్పాలంటే ప్రధానంగా నోబాల్స్, వైడ్స్ వేయడం పూర్తిగా మానుకోవాలని.. లేదంటే వారు వేరే కెప్టెన్‌ కింద ఆడుకోవాల్సి వస్తుందంటూ సీరియస్‌ అయ్యాడు.

గత సీజన్‌లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ, చెన్నై రాణించలేకపోయింది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Exit mobile version