IPL 2023 | థ్రిల్ల‌ర్ కిక్ ఇచ్చిన IPL16..! 153 హాఫ్ సెంచ‌రీలు, 12 సెంచ‌రీల‌తో ప‌రుగుల వ‌ర‌ద‌

IPL 2023 | 200 పైబ‌డి టార్గెట్‌లు, ఛేజింగ్‌ల‌తో చివ‌రి వ‌ర‌కూ వినోదం విధాత: తాజాగా ముగిసిన ఐపీఎల్ 16వ ఎడిష‌న్‌ను ధోని సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎగ‌రేసుకు వెళ్లి పోయిన విష‌యం తెలిసిందే. ఇది ఆ జ‌ట్టుకు 5 వ ట్రోఫీ కావ‌డం విశేషం. అయితే గ‌త ఐపీఎల్ ఎడిష‌న్ల‌లా కాకుండా ఈ సీజ‌న్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించిన‌ట్లు సాగింద‌ని అభిమానులు చెబుతున్నారు. గుజ‌రాత్ టైటాన్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డిన చివ‌రి లీగ్ మ్యాచ్ […]

  • Publish Date - May 30, 2023 / 07:25 AM IST

IPL 2023 |

  • 200 పైబ‌డి టార్గెట్‌లు, ఛేజింగ్‌ల‌తో చివ‌రి వ‌ర‌కూ వినోదం

విధాత: తాజాగా ముగిసిన ఐపీఎల్ 16వ ఎడిష‌న్‌ను ధోని సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎగ‌రేసుకు వెళ్లి పోయిన విష‌యం తెలిసిందే. ఇది ఆ జ‌ట్టుకు 5 వ ట్రోఫీ కావ‌డం విశేషం. అయితే గ‌త ఐపీఎల్ ఎడిష‌న్ల‌లా కాకుండా ఈ సీజ‌న్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించిన‌ట్లు సాగింద‌ని అభిమానులు చెబుతున్నారు.

గుజ‌రాత్ టైటాన్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డిన చివ‌రి లీగ్ మ్యాచ్ త‌ర్వాతే ప్లే ఆఫ్స్ జ‌ట్లు ఖ‌రారు కావ‌డం చూస్తే లీగ్ మ్యాచ్‌లు ఎంత పోటాపోటీగా జ‌రిగాయో అర్థ‌మ‌వుతోంది. దుమ్ములేపే షాట్లు, వికెట్ల‌ను గిరాటేసే చివ‌రి ఓవ‌ర్ బంతుల‌తో టోర్నీ ఆసాంతం ఉర్రూత‌లూగించింది.

సెంచ‌రీల మోత‌

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 16 ఐపీఎల్ సీజ‌న్ల‌లో అత్య‌ధిక సెంచ‌రీలు న‌మోదైన సీజ‌న్‌గా ఇది రికార్డుల‌కెక్కింది. ఏకంగా 12 సెంచ‌రీల‌తో కుర్ర బ్యాట్స్‌మెన్ దంచికొట్టారు. ఇందులో వ‌ర‌స‌గా హ్యాట్రిక్ సెంచ‌రీలు బాదిన గుజ‌రాత్ బ్యాట్స‌మ‌న్ శుభ‌మ‌న్ గిల్ ఆట‌తీరును చూసి తీరాల్సిందే. భ‌విష్య‌త్తులో న‌మ్మ‌ద‌గిన ఆట‌గాడ‌నే న‌మ్మ‌కాన్ని త‌న ఆట‌తీరుతో గిల్ మ‌రింత బ‌ల‌ప‌రిచాడు.

భారీ స్కోర్ల జాత‌ర‌

ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లంటే ఒక‌ప్పుడు 160 మంచి స్కోర్ గా అనిపించేది. త‌ర్వాత 180.. 200 ఇప్పుడు 220 చేస్తేనే గానీ బ్యాటింగ్ టీం ఆశ‌లు పెట్టుకోలేని స్థితి వ‌చ్చింది. 2018లో 15 మ్యాచ్‌ల్లో 200 పైబ‌డి స్కోర్లు న‌మోదు కాగా.. 2022లో 18, అనంత‌రం 2022లో ఆ సంఖ్య ఏకంగా 37కి చేరింది. స‌గ‌టు స్కోరు సైతం 183గా న‌మోదైంది. అలాగ‌ని ఛేజింగుల్లో ఈ సీజన్ ఏ మాత్రం వెన‌క‌బ‌డ‌లేదు. 200 పైబ‌డి టార్గెట్‌ను ఎక్కువ సార్లు ఛేజ్ చేసిన మ్యాచ్‌లు ఈ సీజ‌న్‌లోనే జ‌రిగాయి.

2008, 2012, 2017, 2019, 2020, 2021 సీజ‌న్లలో 1, 2010,18, 22 ల్లో 2, 2014లో 3 మ్యాచ్‌ల్లో 200 ప్ల‌స్ స్కోరును ఛేజ్ చేయ‌గా.. 2023లో ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఈ ఛేజింగ్ విజ‌య‌వంత‌మ‌యింది. ఇందులో ముంబ‌యి అత్య‌ధికంగా నాలుగు సార్లు 200 ప్ల‌స్ స్కోరును ఛేదించింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్… పంజాబ్ పై 257 ప‌రుగులు చేసి ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక టార్గెట్ ఇచ్చిన జ‌ట్టుగా నిలిచింది.

Latest News