WTC Final | జూన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఇదే ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో తొలిరోజు మ్యాచ్‌ను సైతం ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. జూన్ 7 నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో మ్యాచ్ ప్రారంభంకానున్నది. అయితే, భారత్ వరుసగా రెండోసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నది.
2019-21 ఎడిషన్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం.. స్టాండింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో నిలవగా, భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు పలువురు ఐపీఎల్‌లో ఆడుతున్నారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్టార్‌మిక్ , డేవిడ్ వార్నర్.