బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే షోలలో జబర్ధస్త్ ఒకటి. ఈ కామెడీ షో ప్రేక్షకులకి పసందైన వినోదం పంచుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంత మంది కమెడీయన్స్ మారిన,జడ్జెస్ చేంజ్ అయిన సరే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూనే ఉంది. 2013లో ప్రారంభం అయిన షో గత పది సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే ఈ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందని ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ షో మొదట ఫిబ్రవరి 7, 2013 న ప్రారంభించారు. ఈ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యి పాపులర్ అయ్యారు. ఈ షో నుండి వచ్చిన వారు హీరోలుగా కూడా మారారు. అనసూయ, రష్మీలు ఈ షోకి యాంకరింగ్ చేయగా వారి యాంకరింగ్ కూడా షోకి బాగా కలిసి వచ్చింది.
గత రెండేళ్లుగా జబర్దస్త్ షోలో చాలా మార్పులు చోటుచేసుకుండడం మనం చూస్తూనే ఉన్నాం. కమెడియన్లు మారిపోయారు. జడ్జ్ లు మారిపోయారు. కాంబినేషన్స్ కూడా చేంజ్ అయ్యాయి. యాంకర్ అనసూయ, సౌమ్య రావు కూడా షో నుంచి తప్పుకున్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంటి, అవినాష్ వంటి ఆర్టిస్ట్ లు ఈ షో నుండి తప్పుకొని సినిమాలలో బిజీ అయ్యారు. నాగబాబు, రోజా కూడా షోకి దూరంగా ఉంటున్నారు. రాను రాను జబర్ధస్త్ షో ఆదరణ తగ్గిపోతుందని, స్కిట్స్ కూడా అంతగా పేలకపోవడంతో మల్లెమాల సంస్థ ఓ సంచలన నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తుంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం త్వరలో జబర్దస్త్ కామెడీ షో క్లోజ్ కాబోతుందని తెలుస్తుంది. మల్లెమాల టీమ్ జబర్దస్త్ కామెడీ షోని క్లోజ్ చేయాలని, ఇప్పటికే ఈ షో మొదలై పదేళ్లు అయింది కాబట్టి ఇక దీనిని క్లోజ్ చేయాలని వారు భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కామెడీని కమెడియన్స్ అంతగా పండించకపోవడం, దానికి తోడు జడ్జ్ లు, హోస్టులు మారడం వల్లే మల్లెమాల సంస్థ షోని ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పడు వస్తుందో చూడాలి.