Site icon vidhaatha

Viral Video | రైల్వే ట్రాక్‌పై దూసుకెళ్లిన జేసీబీ.. డ్రైవ‌ర్‌పై ప్ర‌శంస‌లు

Viral Video | రైల్వే ట్రాక్‌పై జేసీబీ దూసుకెళ్ల‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. ఒక భారీ జేసీబీ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని లునీ రైల్వే జంక్షన్ వ‌ద్ద ట్రాక్‌ లెవల్‌ పెంచేందుకు, రైల్వే లైన్‌ మార్చేందుకు అధికారులు జేసీబీని వినియోగించారు. ఈ సందర్భంగా రైలు పట్టాలపై జేసీబీ పరుగులు తీసింది. ఈ క్రమంలో జేసీబీ రైల్వే ట్రాక్‌పై బ్యాలెన్స్ కోల్పోకుండా పరుగులు తీసింది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి జేసీబీ డ్రైవర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version