Site icon vidhaatha

Himachal | జేసీబీ మీద‌కు దూసుకొచ్చిన బండ‌రాళ్లు.. తృటిలో తప్పిన ముప్పు

Himachal

విధాత‌: ఉత్త‌రాదిన కురిసిన భారీ వ‌ర్షాల‌కు న‌దులు ఉప్పొంగి వ‌ర‌దలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. హిమాల‌య రాష్ట్రాలైన హిమాచల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌ల‌లో భారీగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో ర‌హదారి ర‌వాణా స్తంభించిపోయింది. అలానే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండీ జిల్లా మీద నుంచి వెళ్తున్న చండీగ‌ఢ్ మ‌నాలీ ర‌హ‌దారిపైనా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డటంతో వాటిని తొల‌గించేందుకు జేసీబీ (JCB) లతో కార్మికులు ప‌ని మొద‌లుపెట్టారు. అప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు ప‌డుతుండ‌టంతో కొండ‌లు వ‌దులుగానే ఉన్నాయి. వారు బండ‌రాళ్ల‌ను ప‌క్కకు తొల‌గిస్తుండ‌గా.. ఒక్క‌సారిగా పైనుంచి పెద్ద పెద్ద రాళ్లు జేసీబీ మీద‌కు దూసుకొచ్చాయి.

అయితే అందులోని డ్రైవ‌ర్, స‌హాయ‌కుడు వెంట‌నే దూకేసి జేసీబీ వెనక్కు వెళ్లిపోవ‌డంతో ప్రాణాలు ద‌క్కాయి. సోమవారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో మంగ‌ళ‌వారం వైర‌ల్‌గా మారింది. ఉత్త‌రాఖండ్లో కురిసిన వ‌ర్షాల‌కు బ‌ద‌రీనాథ్ జాతీయ ర‌హ‌దారి, య‌మునోత్రి హైవేలపై ప్ర‌యాణాలు నిలిచిపోయాయి. మ‌రోవైపు ఒక్క‌సారిగా ఉగ్ర‌రూపం దాల్చిన య‌మున ప్ర‌వాహం నుంచి దిల్లీ ఇప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. వ‌ర‌ద నీరు పోయినా.. పెద్ద ఎత్తున బుర‌ద మేట వేయ‌డంతో ఇబ్బంది త‌లెత్తుతోంది. ఇలాంటి స్థితిలో అంటురోగాలు వ్యాపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, కాచి చ‌ల్లార్చిన నీటినే తాగాల‌ని వైద్యులు పేర్కొన్నారు

Exit mobile version