Site icon vidhaatha

Himachal | కులూలో కుంభ‌వృష్టి

Himachal

విధాత‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులూ జిల్లాలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున కుంభ‌వృష్టి కురిసింది. క్లౌడ్ బ‌రెస్ట్ కార‌ణంగా అనేక ఇండ్లు, వంతెన‌లు కొట్టుకుపోయాయి. వ్య‌వ‌సాయ భూములు సైతం దెబ్బ‌తిన్నాయి.

జిల్లాలోని పంచ‌నాలా ప్రాంతంలో ఐదు ఇండ్లు పూర్తిగా కొట్టుకుపోయాయ‌ని కులూ డిప్యూటీ క‌మిష‌న్ అషుతోశ్ గ‌ర్గ్ తెలిపారు. మ‌రో 15 ఇండ్లు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయ‌ని పేర్కొన్నారు. భుంత‌ర్‌-గ‌డ్సా మ‌ణియార్ రోడ్డు ధ్వంసమైంది.

మ‌రో రెండ్లు వంతెన‌లు వ‌ర‌ద ప్ర‌వాహానికి కొట్టుకుపోయాయి. మ‌ల‌నాలోని హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్టు నిండుకుండ‌లా మారిందని అధికారులు తెలిపారు. అయినా, ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, అన్ని ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.

అనేక ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. ఈ నెల 28 వ‌ర‌కు హిమాచ‌ల్‌లోని ఎనిమిది జిల్లాల‌కు ఆ రాష్ట్ర వాతావ‌ర‌ణశాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీచేసింది. ఆయా జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

Exit mobile version