Kedarnath | కేదార్‌నాథ్‌లో మంచువర్షం.. యాత్ర రిజిస్ట్రేషన్‌ నిలిపివేత

Kedarnath | కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath)కు వెళ్లే భక్తుల కోసం రిషికేశ్ (Rishikesh) , హరిద్వార్‌ (Haridwar) లలో అందుబాటులోకి తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. గత కొద్దిరోజులుగా గర్వాల్‌ ఎగురవ ప్రాంతంలో మంచు వర్షం కురుస్తున్నది. దాంతో ఏప్రిల్‌ 30 వరకు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరో వైపు మంగళవారం కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకోనున్నది. చార్‌ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజర్ అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ […]

  • Publish Date - April 24, 2023 / 04:16 AM IST

Kedarnath |

కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath)కు వెళ్లే భక్తుల కోసం రిషికేశ్ (Rishikesh) , హరిద్వార్‌ (Haridwar) లలో అందుబాటులోకి తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. గత కొద్దిరోజులుగా గర్వాల్‌ ఎగురవ ప్రాంతంలో మంచు వర్షం కురుస్తున్నది. దాంతో ఏప్రిల్‌ 30 వరకు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరో వైపు మంగళవారం కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకోనున్నది. చార్‌ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజర్ అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ మాట్లాడుతూ మంచి కారనంగా కేదార్‌నాథ్‌ రిజిస్ట్రేషన్‌ను రిషికేశ్, హరిద్వార్‌లో ఈ నెల 30 వరకు నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

రానున్నరోజుల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు భారత్‌తో పాటు విదేశాలకు చెందిన 16లక్షల మంది చార్‌ధామ్‌ యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. బద్రీనాథ్‌ (Badrinath) , గంగోత్రి (Gangotri) , యమునోత్రి (Yamunotri) యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

అక్షయ తృతీయ నేపథ్యంలో శనివారం చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి యాత్ర కోసం వచ్చిన భక్తులపై పుష్క వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

హిమాలయాల్లో కొలువైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను కలిసి చార్‌ధామ్‌గా పిలుస్తుంటారు. యాత్రలో ఇప్పటికే గంగ్రోతి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే తెరుచుకోగా.. 25న కేదార్‌నాథ్‌, 27న బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకోనున్నాయి.

Latest News