Bharat Gaurav Train | తక్కువ ధరకే వైష్ణోదేవి, హరిద్వార్‌ దర్శనం.. సికింద్రాబాద్‌ నుంచే భారత్‌ గౌరవ్‌ రైలు..!

Bharat Gaurav Train | భారతీయ రైల్వే ‘భారత్‌ గౌరవ్‌’ రైలును పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైలుకు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సికింద్రాబాద్‌ నుంచి సైతం ప్రత్యేకంగా యాత్రలు నిర్వహిస్తున్నది. ఇటీవల నిర్వహించిన ఐదు కాశీ యాత్రలకు సంబంధించి వందశాతం ఆక్యుపెన్సీ లభించింది. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ ఉత్తరభారతంలోని పలు ప్రసిద్ధ క్షేత్రాలను కవర్‌ చేస్తూ భారత్ గౌరవ్ రైళ్లలో కొత్త టూరిస్ట్ సర్క్యూట్‌ను ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా శ్రీమాతా […]

  • Publish Date - June 5, 2023 / 01:40 PM IST

Bharat Gaurav Train |

భారతీయ రైల్వే ‘భారత్‌ గౌరవ్‌’ రైలును పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైలుకు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సికింద్రాబాద్‌ నుంచి సైతం ప్రత్యేకంగా యాత్రలు నిర్వహిస్తున్నది.

ఇటీవల నిర్వహించిన ఐదు కాశీ యాత్రలకు సంబంధించి వందశాతం ఆక్యుపెన్సీ లభించింది. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ ఉత్తరభారతంలోని పలు ప్రసిద్ధ క్షేత్రాలను కవర్‌ చేస్తూ భారత్ గౌరవ్ రైళ్లలో కొత్త టూరిస్ట్ సర్క్యూట్‌ను ప్లాన్‌ చేసింది.

ఇందులో భాగంగా శ్రీమాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం కల్పించనున్నది. ఈ యాత్ర భారత్‌ గౌరవ్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి నడవనున్నది. ఈ నెల 10న ప్రారంభంకానుండగా ఇప్పటికే దాదాపు 50శాతానికపైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

ప్యాకేజీలో భాగంగా జూన్‌ 10న సికింద్రాబాద్‌ నుంచి రైలు ప్రారంభమవుతుంది. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్‌లతో పాటు మహారాష్ట్రలోని బల్హర్షా , వార్ధా, నాగ్‌పూర్‌ స్టేషన్స్‌లో ఆగనున్నది. కత్రా, ఆగ్రా, మథుర, బృందావన్, హరిద్వార్, రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయనున్నది.

కత్రా స్టేషన్ నుంచి వైష్ణో దేవి ఆలయానికి పోనీ / డోలీ లేదంటే.. హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు సొంత ఖర్చులతో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యాత్ర ఎనిమిది రాతులు, 9 పగళ్ల పాటు సాగనున్నది.

ప్యాకేజీలో రైలు, రోడ్డు రవాణా, వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు టూర్ ఎస్కార్ట్‌లు, భద్రత, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ప్రయాణ బీమా సౌకర్యం ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. ప్యాకేజీ ధర విషయానికి వస్తే ఎకానమీ కేటగిరీ (స్లీపర్‌) రూ. 15,435గా ఉంటుంది. అలాగే 3 ఏసీలో రూ. 24,735, 2 ఏసీ ధర రూ.32,480గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ irctctourism.com సందర్శించాలని సూచించింది.

Latest News