Site icon vidhaatha

Badrinath Temple | తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు.. అఖండ జ్యోతి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు..

Badrinath Temple | ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలను ఆదివారం తెరిచారు. ఉదయం 6 గంటల సమయంలో ద్వారాలను తెరిచారు. ఆర్మీ బ్యాండ్, భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాలను తెరిచిన అనంతరం పూజలు చేసి.. అనంతరం భక్తులను స్వామివారి దర్శనాలకు అనుమతించారు. ఆరు నెలల తర్వాత ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకున్నారు. ఇక్కడ ఆరునెలల పాటు భక్తులు బద్రీనారాయణుడి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉన్నది. ఆలయ ద్వారాలు తెరిచే సందర్భంగా పదివేల మంది భక్తులు ధామ్‌కి చేరుకున్నారు.

అఖండ జ్యోతి దర్శనం కోసం దాదాపు 20వేల మందికిపైగా భక్తులు సాయంత్రం వరకు బద్రీనాథ్‌కు చేరు అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లకు ప్రయాణం ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుంచి ప్రారంభమవుతుంది. గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. ఈ నెల 10న యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. తాజాగా బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలను తెరిచారు. తలుపులు తెరిచిన సందర్భంగా బద్రీనాథ్ పుష్ప సేవా సమితి రిషికేశ్ సహకారంతో ఆస్తా పథంలోని ధామ్‌ను 15 క్వింటాళ్ల ఆర్కిడ్‌లతో అలంకరించారు.

బద్రీనాథ్‌ ఆలయంతో పాటు ధామ్‌లోని పురాతన మఠాలు, ఆలయాలను సైతం బంతిపూలతో అలంకరించారు. ఈ సందర్భంగా బీకేటీసీ మీడియా ఇన్‌ఛార్జ్ మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు పూజలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. సారి బద్రీనాథ్‌ ధామ్‌లో ప్లాస్టిక్‌ నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా హోటల్స్‌, వ్యాపారులకు ప్లాస్టిక్‌ వినియోగించొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version