ఈ ఏడాది హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రకుల్ పెళ్లితో మొదలు ఎవరో ఒక సెలబ్రిటీ పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది.తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్భందా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని పెద్ద షాక్ ఇచ్చింది. 2019 నుంచి పుల్కిత్ సామ్రాట్ అనే నటుడితో ప్రేమలో ఉన్న ఈ భామ కొన్ని నెలల క్రితం చాలా సీక్రెట్‌గా కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక మార్చి 16న ఢిల్లీలో కృతి ఖర్బందా – పుల్కిత్ సామ్రాట్ లు ఏడడగులు వేసినట్టు తెలుస్తుంది. పెళ్లికి కూడా ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.
కృతి ఖర్బందా – పుల్కిత్ సామ్రాట్ తమ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అతి త్వరలో ఈ క్యూట్ కపుల్ ముంబైలో లో బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ఒక టాక్ వినిపిస్తుంది. ఏదైతేనేం మొత్తానికి తను ప్రేమించిన వాడిని మనువాడిన కృతికి పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కృతి కర్బందా విషయానికి వస్తే ఆమె బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ ‘బోణీ’తో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. కెరీర్ మొదట్లో తెలుగుతోపాటు దక్షిణాదిలోని ఆయా భాషల చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది.
తెలుగులో కృతి కర్భందా నటించిన చిత్రాలు చూస్తే.. నాని ‘అలా మొదలైంది’, పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ నటించిన ‘తీన్ మార్’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం 3డీ’ వంటి చిత్రాలు చేసింది. ఈ చిత్రాలు ఆమెకి మంచి సక్సెస్ అందించలేకపోయాయి. చివరిగా తెలుగులో ఈ భామ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’లో చిత్రంలో నటించి అలరించింది. అయితే కృతికి తెలుగు ప్రేక్షకులల్లో పెద్ద ఎత్తున గుర్తింపు లేకపోయిన కూడా బాలీవుడ్ లో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకొని ప్రస్తుతం పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.