బాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నారు మనోజ్ బాజ్‌పేయి. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో అలరిస్తూ వస్తున్నాడు.ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తరువాత బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’ . ఈ వెబ్ సిరీస్‌కి ‘ఉడ్తా పంజాబ్’, ‘సోంచిరియా’ సినిమాల ఫేమ్ అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్నాడు. కొంకణ్ సెన్‌శర్మ కథనాయికగా నటిస్తుంది. ఈ సిరీస్‌లో మనోజ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 11 నుండి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందించారు.
మరోవైపు ఇతర ప్రాజెక్ట్స్‌తో కూడా ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ సీక్రెట్ ను బయటపెట్టారు. తన ఫుడ్ డైట్, హెల్త్ గురించి తీసుకునే జాగ్రత్తలపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. మనోజ్ బాజ్‌పేయి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నట్టు తెలియజేశారు. 14 సంవత్సరాలుగా రాత్రి భోజనం చేయలేదంట. తాను డిన్నర్‌లను ఎందుకు వదులుకున్నానన్న కారణాన్ని వెల్లడించి షాకిచ్చారు. తను వ్యాయామానికి కూడా చాలా ప్రాముఖ్యతనిస్తానని,కొన్ని నియమాలని కూడా పాటిస్తానని అన్నారు. ఇక బరువు పెరగడం, అనారోగ్యం మనకి అతి పెద్ద శత్రువు అని అన్నారు.
రాత్రి భోజనం చేయడం మానేస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం పాటు అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండోచ్చని తెలిపారు. తనకు ఆహారం అంటే ఇష్టం ఉన్నా తీసుకోవడం తగ్గించినట్టు తెలియజేశారు.ఆహారం మనకు అతి పెద్ద స్నేహితుడు, అలాగే మనకు అతి పెద్ద శత్రువు కూడానూ అని వివరించారు. తను రాత్రి తినడం మానేశానని, పగటిపూట సమతుల్య ఆహారం తీసుకుంటానని, నా ఫిట్‌నెస్ కు సహకారంగా ఉంటుందన్నారు. మొత్తానికి మనోజ్ చెప్పిన విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి.