NH66 Collapses In Kerala : కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు

కేరళలో కొట్టాయం-పాలక్కడ్ జాతీయ రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. కొత్త రోడ్డే ఇలా కుంగిపోవడం విమర్శలకు దారితీసింది.

National Highway 66 collapses in Kerala

విధాత : కొత్తగా నిర్మించిన రహదారి మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయి వాహనదారులకు ప్రాణభీతిని పరిచయం చేసింది. కేరళలోని కొట్టాయం-పాలక్కడ్ 66వ జాతీయ రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో రహదారి పగుళ్లలో పలువాహనాలు ఇరుక్కుపోయి ముందుకు కదల్లేకపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కొత్తగా వేసిన రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం పట్ల స్థానికులు, వాహనదారులు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు రహదారి కుంగిన వీడియోలతో జోరుగా ట్రోలింగ్ చేస్తున్నాయి.

కేరళ సముద్ర తీరం వెంట సాగే 66వ నెంబర్ 6లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో చాలచోట్ల పగుళ్లు ఏర్పడి కుంగుబాటుకు గురైంది. దీనిపై నేషనల్ హైవే అథారిటీ ఇప్పటికే ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని ముంబైని కన్యాకుమరిని కలిపే 1600కిలో మీటర్ల రహదారి ఇంది. కేరళలో 644కిలోమీటర్లు సాగుతూ కొట్టాయం, కొల్లం, అలప్పుజా, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్ నగరాలను కలుపుతూ పాలక్కడ్ వరకు కొనసాగుతూ..544వ రహదారితో కలుస్తుంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళా, తమిళనాడు రాష్ట్రాల మీదుగా సాగుతూ కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. 2026మార్చి వరకు ఈ రహదారి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే 50శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. ఇంతలో కేరళలో పూర్తయిన రహదారి మార్గంలో పగుళ్లు ఏర్పడటం విమర్శలకు దారితీసింది.

ఇవి కూడా చదవండి :

Bigg Boss 9 | 13వ వారం ఊహించ‌ని ఎలిమినేషన్… ఆ కంటెస్టెంట్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై సస్పెన్స్ పెరిగినట్టే!
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!

Latest News