నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. ఈ రోజు లేదా రేపు ఆయన ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారాలు సాగుతున్ననేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. బాలయ్యకు సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తొలి సినిమా అవుతుందా? లేదంటే రెండో సినిమా అవుతుందా? అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసేవారి లిస్ట్‌లో చాలా మంది పేర్లు వినిపించాయి.
ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా ఉంటుందని, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని అప్పట్లో ఓ టాక్ నడిచింది. వారసులను చాలా గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేసే బోయపాటి శీను, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల పేర్లు కూడా వినిపించాయి. అయితే మోక్షజ్ఞ వెండితెరకి ఎంట్రీ ఇస్తాడని చెబుతున్నా అతని లుక్ మాత్రం అందరిలో అనేక అనుమానాలు కలిగేలా చేసింది. నవంబర్ 30న హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ కి మోక్షజ్ఞ తన అమ్మమ్మతో కలిసి వచ్చాడు. అప్పుడు మోక్షజ్ఞ చాలా స్లిమ్‌గా కనిపించాడు. చివరిగా భగవంత్ కేసరి సినిమా టైంలో మోక్షజ్ఞ కనిపించగా, గతంలో కన్నా కొంచెం బరువు తగ్గినట్ట కనిపించాడు.
ఇక ఇప్పుడు అయితే మోక్షజ్ఞ చాలా స్లిమ్‌గా కనిపించాడు. సినిమా కోసమే మోక్షజ్ఞ ఇలా స్లిమ్ లుక్‌లో మారాడని, అతి త్వరలోనే మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే బాలయ్య త్వరలోనే మోక్షజ్ఞని హీరోని చేస్తానని, శ్రీలీల హీరోయిన్ గా ఉండొచ్చని కూడా చెప్పాడు. దీంతో ఈ నందమూరి వారసుడి కోసం అభిమానులుఎదురు చూస్తున్నారు.