Site icon vidhaatha

గిల్లితే గిల్లించుకోవాలా.. నాగార్జున‌కి ఉన్న అల‌వాటు న‌చ్చ‌క సినిమా రిజెక్ట్ చేశా..

న‌దియా పేరు చెబితే కొంద‌రికి ఠ‌క్కున గుర్తుకు రాక‌పోవ‌చ్చు. కాని అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌న్ అత్త‌గా న‌టించిన న‌టి అంటే మాత్రం వెంట‌నే గుర్తుప‌డ‌తారు.ఈ చిత్రంలో త‌న‌దైన న‌ట‌న‌తో ఎంతో మంది తెలుగు ప్రేక్ష‌కుల‌కి దగ్గ‌రైంది న‌దియా. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కి గాను బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా నంది పురస్కారం కూడా లభించింది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా న‌టించిన న‌దియా ఆ త‌ర్వాత స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించ‌డం మొదలు పెట్టింది. ప్రభాస్ కి అమ్మ పాత్ర‌లో కూడా న‌టించింది. దృశ్యం, బ్రూస్‌లీ, అ..ఆ, సర్కారు వారిపాట, అంటే సుందరానికి, గని, ది వారియర్‌ తదితర సినిమాలలో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించింది.

న‌దియా ఒక‌ప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో స్టార్‌ హీరోల సరసన నటించారు. రజనీకాంత్, మోహన్‌లాల్‌, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ వంటి టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే 1988లో అమెరికన్ బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకున్నారు నదియా. ఆతర్వాత ఫ్యామిలిలీతో కలిసి యూఎస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డ ఆమె 1996లో సనమ్‌ అనే కుమార్తెకి జ‌న్మ‌నిచ్చింది. ఆతర్వాత ఐదేళ్లకు అంటే 2001లో రెండో అమ్మాయి జానా వీరి జీవితంలోకి అడుగుపెట్టింది.

నదియా. తెలుగులో చివరగా `సర్కారు వారి పాట` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె బ్యాంక్‌ మెనేజర్‌ పాత్రలో నటించి మెప్పించారు. ఇందులో ఆమె ఉన్న‌ది కొంత సేపే అయిన కూడా ఆమె సన్నివేశాలు చివర్లో కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. హైలైట్‌గా నిలిచాయి. అయితే న‌దియాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రంలో నాగార్జున ఉన్న కార‌ణంగా ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసింద‌ట‌. ముందు ర‌మ్య‌కృష్ణ పాత్ర కోసం న‌దియాని సంప్ర‌దించార‌ట‌. ఇందులో నాగార్జున త‌ర‌చు ర‌మ్య‌కృష్ణ న‌డుము గిల్లుతాడు. అలా ప‌దే ప‌దే నాగార్జున న‌డుము గిల్ల‌డం త‌న‌కు ఇష్టం లేక న‌దియా మూవీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసింద‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త వైర‌ల్‌గా మారింది. న‌దియా వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ఇంకా యంగ్ లుక్‌లోనే క‌నిపిస్తుంటుంది. త‌న కూతుళ్ల‌తో న‌దియా దిగిన ఫొట‌లు చూసి అక్కాచెల్లెళ్లుగా ఉన్నారే కానీ తల్లి కూతుళ్లుగా మాత్రం కాదంటున్నారు అభిమానులు.

Exit mobile version