Site icon vidhaatha

అమ‌ర్‌దీప్‌కి హ్యాండిచ్చి… శోభాశెట్టిని మాత్రం స‌ర్‌ప్రైజ్ చేసిన నాగార్జున‌

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మానికి సీజ‌న్ 3 నుండి హోస్ట్‌గా ఉంటూ వ‌స్తున్నారు నాగార్జున‌.ఇప్ప‌టికే న‌టుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న నాగార్జున ఇప్పుడు హోస్ట్‌గా కూడా అద‌ర‌గొట్టేస్తున్నాడు. ప్ర‌తి సీజ‌న్‌లో కూడా కంటెస్టెంట్‌ల‌తో చెడుగుడు ఆడుకుంటూ షో మ‌రింత ర‌క్తి క‌ట్టేలా చేస్తున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చిన కంటెస్టెంట్స్ ఒక్కోసారి నాగార్జున‌ని విచిత్ర కోరిక‌లు కోరుతుంటారు. అయితే వాటిలో కొన్ని తీర్చే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. సీజ‌న్‌7లో కార్తీక దీపం మోనిత అలియాస్ శోభ శెట్టి నాగార్జున‌ని ఓ కోరిక కోరింది. దీనికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇప్పుడు అది చేసి చూపించాడు కూడా.

శోభిత బిగ్ బాస్ సీజ‌న్ 7తో బాగా పాపుల‌ర్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు ఆమెపై నెగెటివిటీ ఎక్కువ‌గా న‌డించింది. ఈమె ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది బాబోయ్… అని గగ్గోలు పెట్టారు. ఎట్టకేలకు ఫినాలేకి ముంది 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. కొన్ని వారాల‌లో శోభ శెట్టి కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బలి చేశారనే వాదన వినిపించింది. ఆమె హెడ్ వెయిట్, యాటిట్యూడ్, రెచ్చగొట్టే ఎక్స్ ప్రెషన్స్ మెజారిటీ ఆడియన్స్ కి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. ఎప్పుడో బ‌య‌ట‌కు రావల్సిన ఆమెని స్టార్ మా కాపాడుతూ వ‌చ్చింద‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా శోభాశెట్టిని చాలా మంది ట్రోల్ చేశారు.

ఈ క్ర‌మంలో క్షమాపణలు చెప్పింది. అంతా ఆటలో భాగమే అర్థం చేసుకోవాలని వేడుకుంది. ఇక బిగ్ బాస్ షో ద్వారా రెమ్యూనరేషన్ రూపంలో శోభ శెట్టి రూ. 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ గా ఒక టాక్ న‌డిచింది. అలానే హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ఒక వారం నాగార్జున ధ‌రించిన టీ ష‌ర్ట్‌పై మ‌న‌సు ప‌డింది శోభాశెట్టి. అది త‌న‌కు కావాల‌ని, ఇస్తారా అని నాగార్జున అడ‌డ‌గా ఓకే చెప్పాడు. ఎట్ట‌కేల‌కి శోభ‌కి నాగార్జున ఆ టీ షర్ట్ పంపించాడు. శోభా తాజాగా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. నాగార్జున బహుమతిగా ఇచ్చిన టీ షర్ట్ ధరించి ఓ వీడియో చేసింది. దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ధరించిన ఒక్కో టీ షర్ట్ ధర రూ. 2 లక్షలకు పైమాటే ఉంటుంది. అమర్ దీప్ కూడా ఒక టీ షర్ట్ కావాలని అడగ‌గా, అందుకు కూర్చో అని అన్నాడు. మ‌రి అమ‌ర్ దీప్‌కి అందిందో లేదో తెలియ‌దు కాని శోభా మాత్రం కాస్ట్‌లీ టీ ష‌ర్ట్ ద‌క్కించుకుంది. 

Exit mobile version