లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గానే ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్‌లోనూ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా డెబ్యూ ఇచ్చింది. హిందీలో తను నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా షారుఖ్ ఖాన్‌లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ ఆ చిత్రంతో మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు నయనతారకి తెలుగు, తమిళం, హిందీ భాషలలో విపరీతమైన క్రేజ్ ఉంది.
అయితే ఈ మూడేళ్లలో నయనతార నటించిన సినిమాల్లో జవాన్‌తో పాటు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన కాథు వకుల రెండు కాదల్ సినిమాలు మాత్రమే మంచి విజయాలు సాధించగా, మిగతా చిత్రాలన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తమిళంలో రజనీకాంత్ అన్నాత్తే అనే చిత్రం చేయగా, ఈ మూవీ దారుణంగా నిరాశపరచింది. నెట్రికన్, కనెక్ట్, ఇరవైన్, కాథు వకుల రెండు కాదల్ సినిమాలు చేయగా, ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక డిసెంబర్ 1న అన్నపూర్ణితో ప్రేక్షకుల ముందుకొచ్చింది నయనతార. కథలో కొత్తదనం లేకపోడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా మారింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే అన్నపూర్ణి సినిమాపై హిందూ, బ్రాహ్మాణ సంఘాలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశాయి. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని, ముఖ్యంగా ముస్లిం అబ్బాయి, బ్రాహ్మణ అమ్మాయితో ప్రేమలో పడినట్లు చూపించడంపై చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక ఇదిలా ఉంటే నయనతార మలయాళంలో కూడా సినిమా చేసింది. నిజాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జోడీగా గోల్డ్ అనే సినిమాలు చేసింది నయనతార. ఈ రెండు కూడా నిరాశపరిచాయి.ఇక తెలుగులో గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాల్లో నటించగా ఆ రెండు చిత్రాలు కూడా పూర్తిగా నిరాశపరిచాయి. రీసెంట్‌గా విడుదలైన జవాన్ మాత్రమే నయనతారకి పెద్ద హిట్ అందించింది. ఇక మూడేళ్లలో తొమ్మిది ఫ్లాప్‌లు ఎదురైన కోలీవుడ్‌లో నయనతారకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్‌లో టాప్‌గా నిలిచింది. ఒక్కో సినిమాకు నయనతార 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.ఇప్పుడు ఆమె ఖాతాలో ఐదు సినిమాలు ఉన్నట్టు సమాచారం.