విధాత: ప్రపంచం ముందెన్నడు చూడని అద్బుత నృత్య ప్రదర్శన భారత దేశంలో ఆవిష్కృతమైంది. ఏకకాలంలో 10,000మంది ఒకేరకమైన సాంప్రదాయ వస్త్రధారణతో..ఏకరూప నృత్య ప్రదర్శన చేశారు. ఇంతటి అద్బుత నృత్య ప్రదర్శనకు భారత్ దేశంలోని అస్సాం రాష్ట్రం గౌహాతి స్టేడియం వేదికగా మారింది. దీనికి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.
గౌహతిలో జరిగిన చారిత్రాత్మక బగురుంబా ద్వౌ పిలిచే సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా 10,000 మంది కళాకారులు అరుదైన నృత్య ప్రదర్శన చేశారు. మానవ జీవితానికి, ప్రకృతి ప్రపంచానికి మధ్య సామరస్యాన్ని చాటి చెప్పే బోడో ప్రజల సాంస్కృతిక నృత్యంగా బగురుంబా ద్వౌ ప్రదర్శనకు గుర్తింపు ఉంది. 10,000మంది బోడో కళాకారులు ప్రదర్శించిన ఈ అద్భుతమైన ప్రదర్శనను స్వయంగా వీక్షించిన ప్రధాని మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. బోడో తెగ ప్రజల అభివృద్ది, సంస్కృతుల పరిరక్షకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అస్సామ్ పర్యటనలో భాగంగా మోదీ వందే భారత్ స్వీపర్, అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు.
🇮🇳 PM Modi Joins Historic Bagurumba Dwhou In Guwahati As 10,000 Artists Unite In Spectacular Bodo Showcase
📹 @narendramodi pic.twitter.com/DKGDvFKu2B
— RT_India (@RT_India_news) January 17, 2026
