Elephant Birthday Video : ఏనుగు పిల్లకుపుట్టిన రోజు వేడుకలు..వీడియో వైరల్

ఏనుగు పిల్లకు అదిరిపోయే బర్త్‌డే పార్టీ! అస్సాంలో ‘మోమో’ మొదటి పుట్టినరోజు వేడుకలు వైరల్. ఫ్రూట్ కేక్, పూలమాలలతో సంరక్షుల సందడి..

Elephant Birthday Video

విధాత : వన్యప్రాణుల సంరక్షణ విధులు నిర్వహించే అటవీ శాఖ సిబ్బంది తాము నిత్యం చూసే వన్యప్రాణుల పట్ల ప్రత్యేక ఆపేక్షత ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ ఏనుగు పిల్లకు తొలి పుట్టిన రోజు నిర్వహించిన అటవీ సిబ్బంది సంబరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాంలో ఏనుగు పిల్ల ప్రియాన్షి (మోమో)కు దాని సంరక్షులు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య మొదటి పుట్టినరోజును నిర్వహించారు.ఈ వేడుకలో పండ్లు, తాజా కూరగాయలతో చేసిన పెద్ద కేక్ ను ఏర్పాటు చేశారు.

ఏనుగు పిల్ల పుట్టిన రోజు వేడుకలో భాగంగా దాని సంరక్షుడు బిపిన్ కశ్యప్ నూతన వస్త్రం, రెడిమెడ్ పూలమాలను అలంకరించారు. హ్యాపీ బర్త్ డే మోమో అంటూ బిపిన్ కశ్యప్ అనందంతో తన ఏనుగు పిల్లకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.

తల్లి ఏనుగు పక్కనే ఉండగా సంరక్షణ సిబ్బంది మధ్య తన తొలి పుట్టిన రోజు వేడుకను రకరకాల రుచికరమైన ఆహార పదార్ధాలను భుజిస్తూ సంబురంగా జరుపుకుంది. ఏనుగు పిల్లకు ప్రేమగా పండ్లు, కూరగాయలు, ధాన్యం, వేరుశనగా, చెరుకు గడలు వంటి ఆహారాన్ని తినిపించిన సిబ్బంది ఏనుగు పిల్లతో పాటు ఆనందోత్సహాలు పొందారు.

ఇవి కూడా చదవండి :

Raashii Khanna | ట్రెడిషనల్ లుక్ లో అందాల డోస్ పెంచేసిన రాశి ఖన్నా
Chhattisgarh | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 100 కేజీల పేలుడు ప‌దార్థాలు, 16 ఐఈడీలు స్వాధీనం

Latest News