Site icon vidhaatha

Prabhas – Anushka | మరోసారి వెండితెరపై మెరవనున్న ప్రభాస్‌-అనుష్క జోడి..! సందీప్‌ వంగా మూవీలో హీరోయిన్‌గా స్వీటీ ఫిక్స్‌..!

Prabhas – Anushka | వెండితెరపై కొన్ని జోడీలకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. అందులో ప్రభాస్‌ – అనుష్క జంట ఒకటి. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. తాజాగా ఈ జంట మరోసారి కలిసి సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవనున్నట్లు తెలుస్తున్నది. అనుష్క – ప్రభాస్‌ జంటగా బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి-2 చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. స్క్రీన్‌పై వీరిద్దరి రొమాన్స్‌ను చూసేందుకు అభిమానుల ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రభాస్‌ – అనుష్క జోడీతో డైరెక్టర్‌ సందీప్‌ వంగ చిత్రంలో పనిచేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. చివరిసారిగా సలార్‌తో హిట్‌కొట్టాడు. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి’ చిత్రంలో నటించనున్నాడు. హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కతున్నది. అదే సమయంలో ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు సందీప్‌ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ మూవీని చేయనున్నాడు.

స్పిరిట్‌ మూవీ టైటిల్‌ను ప్రారంభించినా.. ఇప్పటి వరకు పనులేవీ మొదలవలేదు. దీనికి కారణంగా ప్రభాస్‌, సందీప్‌ ఇద్దరూ బిజీగా ఉండడంతో చిత్రం పనులు ముందుకు సాగలేదు. కొద్ది రోజుల్లోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. స్పిరిట్‌లో హీరోయిన్‌గా అనుష్కను తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా అనుష్కకు స్టోరీ చెప్పాడని.. కథ నచ్చడంతో నటించేందుకు గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చినట్లు టాక్‌. స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరలో ప్రారంభించేందుకు ముహూర్తం సైతం ఖరారు చేసినట్లు టాక్‌. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోసారి ప్రభాస్‌-అనుష్క వెండితెరపై కనిపించున్నారని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుష్క చాలాకాలం చివరిసాగా ‘మిస్సెస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో కనిపించింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో మెరిసింది. తాజాగా ‘కథనార్‌’ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నది. మొన్నటి వరకు బొద్దుగా కనిపించిన అనుష్క మళ్లీ సన్నజాజితీగలా మారింది. ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Exit mobile version