Site icon vidhaatha

Prabhas-Anushka Shetty| ఫ్యాన్స్ కు పండగే.. ప్రభాస్ -అనుష్కలు ఒకే వేదికపైకి..!

విధాత : టాలీవుడ్ హిట్ ఫెయిర్ గా..క్రేజీ జంటగా గుర్తింపు పొందిన హీరో హీరో యిన్లు ప్రభాస్(Prabhas)-అనుష్క(Anushka Shetty) లు చాల కాలం తర్వాతా ఒకే వేదికపైకి రాబోతున్నారు. బాహుబలి 2 తర్వాత మళ్లీ 8ఏళ్లకు వారిద్దరిని అదే బాహుబలి మూవీ కలుపుతుండటం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో శోభా యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలై ఇప్పటికే పదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా బాహుబలి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌'(Baahubali The Epic)పేరుతో అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. చిత్ర యూనిట్‌ ‘బాహుబలి: ది ఎపిక్‌’ కోసం ప్రమోషన్స్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంది. బాహుబలి రెండు భాగాల్లో ప్రభాస్‌ , రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన సంగతి తెలిసిందే. వారందరితో ‘బాహుబలి: ది ఎపిక్‌’ ప్రమోషన్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.

‘బాహుబలి: ది ఎపిక్‌’ విడుదల సందర్భంగా ఇప్పటికే ప్రభాస్‌, రానాలతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే అనుష్క కూడా ప్రభాస్, రానాలతో కలిసి ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం అనుష్క హైదరాబాద్‌లోనే ఉంది. అనుష్క నటించిన ‘ఘాటి’ చిత్రం సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌తో పాటు ‘బాహుబలి: ది ఎపిక్‌’ ప్రమోషన్ వర్క్ కూడా పూర్తి చేయాలనుకుంటుందని సమాచారం.

Exit mobile version