Site icon vidhaatha

ప్రకాష్ రాజ్ ఫస్ట్ భార్యకు అన్ని లక్షలు ఇస్తున్నారా?

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తిరుగులేని నటుడిగా విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. ఆయన ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫేమ్ ను సంపాదించుకున్నారు. తండ్రి, అన్న, విలన్, హీరో పాత్రల్లో నటించి మెప్పించారు. ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆయన అభిమానులుగా మార్చుకున్నారు. ప్రకాష్ రాజ్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎక్కువగా తెలుగులోనే నటించారని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

కాగా ప్రకాష్ రాజ్ కన్నడ వ్యక్తి అయినా తెలుగులో మంచి ఫేమ్ ఉంది. అందుకే కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన మంచు విష్ణు పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రకాష్ రాజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆయనకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. అంతేకాదు ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. ప్రకాష్ రాజ్ ఫస్ట్ బార్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిద్దరూ విడిపోయినా కూడా అప్పుడప్పుడు హెల్దీ రిలేషన్ తో ఫ్రెండ్స్ లా కలుస్తూనే ఉంటారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా తన పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తారట.

అయితే ఫస్ట్ బార్యతో విడిపోయిన ప్రకాష్ రాజ్ తన భార్యకు నెలకు 6 లక్షల వరకు పంపిస్తారట. ఎందుకంటే తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఇలా డబ్బుల్ని పంపిస్తారట. పిల్లల భవిష్యత్ కోసం తన పిల్లలకు సరైన ఎడ్యుకేషన్, మంచి వసతులు కల్పించాలని ప్రకాష్ రాజ్ తన భార్యకు ఇలా ప్రతినెలా డబ్బుల్ని పంపిస్తారని తెలుస్తుంది. కాగా ప్రకాష్ రాజ్ రెండో వివాహం కూడా చేసుకున్నారు. ఇక ప్రజంట్ ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Exit mobile version