జ‌ర‌గండి పాట కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా.. అయిన ఉప‌యోగం లేకుండా పోయిందిగా..!

  • Publish Date - March 29, 2024 / 02:14 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం గేమ్ ఛేంజ‌ర్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. కొన్ని కారణాలుతో ఈ మూవీ రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. కనీసం అప్‌డేట్స్ కూడా ఇవ్వ‌కుండా ఫ్యాన్స్‌ని డిజ‌ప్పాయింట్ చేస్తూ వ‌చ్చారు. అయితే రామ్ చ‌రణ్ బ‌ర్త్ డే మార్చి 27న కాగా, ఆ రోజు అభిమానుల‌కి ట్రీట్‌గా ఈసినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. “జరగండి” అనే పాటను విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దలేర్ మెహంది, సునిధి చౌహన్ పాడారు. పాట‌కి తమన్ సంగీతం సమకూర్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ పాట రిలీజైంది.

అయితే పాట అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. దాదాపు 18 కోట్ల రూపాయ‌లు ఈ పాట‌కి ఖ‌ర్చు పెట్టార‌ని టాక్. నిర్మాత‌లు కూడా ఓ సంద‌ర్భంలో భారీగానే ఖ‌ర్చు చేసిన‌ట్టు చెప్పారు. అయితే సాంగ్‌లో అంత గొప్ప‌గా ఏమి ఉంద‌ని, అస‌లు అంత ఖ‌ర్చు పెట్టే అంత ఇందులో ఏమి ఉంద‌ని పెద‌వి విరుస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ అభిమానులు ఈ పాట ఆయన స్థాయికి తగ్గట్టు లేదని మండిప‌డుతున్నారు. నాటు నాటు పాట ద్వారా రామ్ చరణ్ తేజ్ క్రేజ్ గ్లోబ‌ల్ స్థాయికి వెళ్లింది. కాని ఈ పాట‌తో ఆయ‌న స్థాయి మ‌రి దిగ‌జార్చారుగా అంటూ మండిప‌డుతున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో ఇంతటి తక్కువ ప్రమాణాలతో పాట ఉండ‌డం ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు.

పాట అంత‌గా బాలేద‌ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు., అయితే పాట కాపీ అని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు కాపీ చేసిన కూడా ఆకట్టుకునేలా, వినసొంపుగా లేకుండా చేశావ‌ని తిట్టి పోస్తున్నారు. అంతేకాదు షణ్ముఖ్‌ సినిమాతో పోల్చడం ఇప్పుడు మరింత దారుణంగా మారింది. `జరగండి` పాటకి వ్యూస్‌ కూడా తక్కువగా వ‌చ్చాయ‌ని, 24 గంటల్లో ఇది ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టింద‌ని అంటున్నారు.. తెలుగు, తమిళం, హిందీలో దీనికి కేవలం 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే. పాట అట్ల‌ర్ ఫ్లాపే అని ఓ వ‌ర్గం చెప్పుకొస్తున్న మాట‌. 

Latest News