విధాత: ఇటీవల సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). RRR వంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత రామ్ చరణ్ (Ram Charan) సోలో హీరోగా నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి అశించినంత ఆదరణ దక్కించుకోలేక పోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముందు నుంచి అనుకున్న తేది కాకుండా వారం ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది.
తమిళ క్రియేటివ్ దర్శకుడు జిగర్తాండ ఫేం కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన ఈ మూవీకి మరో తమిళ అగ్ర దర్శకుడు, శంకర్ (Shankar) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శంకర్ స్ట్రెయిట్‌గా తెలుగులో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. రామ్ చరణ్ సరసన అంజలి (Anjali), కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికలుగా నటించగా ఎస్జే సూర్య (SJ Suryah), జయరాం, శ్రీకాంత్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. తమన్ (ThamanS) మ్యూజిక్ ఈ చిత్రానికి ఫ్లస్ పాయింట్‌గా నిలవగా సినిమా విడుదలకు ముందే పాటలు మంచి ఆదరణను దక్కించుకున్నాయి.
పూర్తిగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ IAS అధికారి సిన్సియర్‌గా విధులు నిర్వహిస్తే ఏమేం చేయగలడనే కథా నేపథ్యంలో సినిమా సాగుతుంది. అవినితీ, అక్రమాలకు కేరాఫ్‌గా ఉన్న ఓ మంత్రి సీఎం కావడానికి చేసిన పనులు, దానిని నిబద్దత గత అధికారి ఎలా అడ్డుకున్నాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఈ క్రమంలో పాలన చేస్తున్న అధికార పార్టీకి, IAS అధికారి తండ్రి అప్పన్నకు ఉన్న లింకేంటి, చివరకు IAS ఏం చేశాడనేది సినిమా.
అయితే ఈ సినిమాను మొదటగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లలో మూవీ రిలీజైన 30 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ తేదీ కాదని ఓ వారం ముందుగానే అంటే ఫిబ్రవరి 07వ తారీఖు నుంచే ఈ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. ఇక ఈ మూవీని ఎవరైతే థియేటర్లలో మిస్సయ్యారో ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు.