టాలీవుడ్ అందాల ముద్దుగమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు మంచిహిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా మారిన పూజా హెగ్డే ఇప్పుడు సరైన అవకాశాలు లేక దిగాలుగా ఉంది. చివరిసారిగా ఈ భామ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలతో అలరిస్తూ ఉంది. అయితే తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమెని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని పాపులర్ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన గొడవ తర్వాత పూజాని చంపేస్తామని బెదిరించారని, దీంతో పూజా అక్కడి నుంచి వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చిందంటూ ఆయన తన పోస్ట్‌లో తెలియజేశాడు.
ఇది చూసిన వారందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటి పూజాని చంపేస్తామని బెదిరించడమేంటని టెన్షన్‌లో ఉన్నారు. అయితే తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్స్ పై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. పూజా హెగ్డేని చంపేస్తామని వచ్చిన బెదిరింపులు పూర్తిగా నిరాధారమని పూజా టీమ్ తెలిపింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కాస్త చల్లపడ్డారు. అయితే ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కాని అదంతా పూర్తిగా అవాస్తవం అని పూజా టీమ్ చెప్పుకోచ్చింది. అయితే వైరల్ భయానీ కొద్ది సేపటికి పూజా హెగ్డేకు చంపేస్తామని బెదిరింపులుకి సంబంధించిన పోస్ట్‌ని డిలీట్ చేశారు.
ప్రస్తుతం పూజా హెగ్డేకి తెలుగులో అవకాశాలు లేవు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తోన్న దేవా చిత్రంలో నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తుండగా.. సిద్ధార్థ్ రాయ్ కపూర్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాతో అయిన పూజా హెగ్డే సుడితిరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ హౌస్ ఫుల్ 5లోనూ నటిస్తుంది. ఇందులో అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బందా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ , చుంకీ పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.