పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ధమాకాతో మంచి హిట్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. కేక పెట్టించే అందం, ఆకర్షించే అభినయం దానికి తోడు డ్యాన్స్ ఫ్లోర్‌ని రఫ్ఫాడించే టాలెంట్ శ్రీలీల సొంతం. ఈ అమ్మడి చేతిలో దాదాపు అరడజనుకి పైగా సినిమాలు ఉండగా, ఒక్కో సినిమాతో ప్రేక్షకులని పలకరిస్తుంది. రీసెంట్‌గా `ఆదికేశవ` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో శ్రీలీల కూడా కృతి శెట్టి మాదిరిగా మారుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కృతి శెట్టి కూడా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది.
కాని వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమై తమిళం, మలయాళంలో సినిమాలు చేసుకుంటుంది. అయితే శ్రీలీలకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ వేరు. ఆమె కోసం హీరోలు, దర్శక, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. పారితోషికం ఎంతైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. శ్రీలీల మరో రెండు వారాల్లో `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ హీరోగా రూపొందిన ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా గురించి టాకే లేదు. సినిమా బిజినెస్ పరంగానూ స్ట్రగుల్ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదికేశవతో ఫ్లాప్ చూసిన శ్రీలీల ఇప్పుడు నితిన్ సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంటే ఆమె పరిస్థితి మాత్రం కృతి శెట్టి మాదిరిగా కావడం ఖాయం అంటున్నారు.
`ధమాఖా` చిత్రంతో మంచి హిట్ కొట్టిన శ్రీలీలకి దాదాపు పది ఆఫర్లు వచ్చాయి. పది సినిమాలకు సైన్ చేసింది. వాటిలో `స్కంద`, `భగవంత్ కేసరి`, `ఆది కేశవ`, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా, నితిన్ `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్`, మహేష్‌బాబు `గంటూరు కారం`, పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్`, కన్నడ మూవీ, అలాగే చిరంజీవి చిత్రంలో కూడా ఈ అమ్మడి పేరు వినిపించింది. వీటిలో చూస్తే `భగవంత్ కేసరి` మూవీ ఫర్వాలేదనిపించుకున్న రామ్‌తో నటించిన `స్కంద` డిజాస్టర్ , వైష్ణవ్ తేజ్‌తో చేసిన `ఆదికేశవ` రిజల్ట్ తేడా కొట్టడం శ్రీలీలని ఇబ్బందులకి గురి చేస్తుంది. `గుంటూరు కారం`, `ఉస్తాద్ భగత్ సింగ్` వంటి రెండు భారీ ప్రాజెక్ట్ లు ఈ అమ్మడి చేతిలో ఉండగా, వీటితోనే శ్రీలీల కమ్‌బ్యాక్ ఇవ్వాలి.