ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొస్తున్న కుర్రభామలు వరుస సక్సెస్‌లు సాధించలేక చతికిలపడుతున్నారు. కృతి శెట్టికి ఉప్పెన చిత్రం మంచి విజయం అందించగా, ఆ తర్వాత ఈ అమ్మడు వరుస హిట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. కాని తర్వాత చేసిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో కృతికి తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. శ్రీలీలకే దర్శకులు వరుస అవకాశాలు ఇవ్వడంతో అమ్మడు ఇప్పుడు తెలుగులో దుమ్ము రేపుతుంది. అయితే అమ్మడికి అవకాశాలు వస్తున్నా కూడా అవి సక్సెస్ కాకపోతుండడం అభిమానులని ఎంతగానో కలవరపరుస్తుంది. పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ధమాకాతో మంచి హిట్ కొట్టింది.
ఇక ఆ తర్వాత ఏకంగా పది సినిమా అవకాశాలు దక్కించుకుంది. సమంత, రష్మిక, పూజా వంటి హీరోయిన్లందరినీ పక్కకు నెట్టి మరీ టాప్ హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకుంది. అయతే ఈ అమ్మడికి పరాజయాలు క్యూ కడుతున్నాయి. గుంటూరు కారం చిత్రంతో ఫ్లాపుల విషయంలో హ్యాట్రిక్ కొట్టింది శ్రీలీల. స్కంధ చిత్రంతో ఫెయిల్యూర్ ప్రారంభం కాగా, . మధ్యలో భగవంత్ కేసరి కాస్త రిలీఫ్‌నిచ్చింది. ఈ మూవీ హిట్ అయిన బాలయ్య ఖాతాలోకి వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన ఎక్స్ ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ చిత్రాల గత నెలలో బోల్తా కొట్టాయి. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా కూడా మోస్తరుగా నిలిచింది. మూవీని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నా, చాలా వరకు నెగటివ్ టాక్ వస్తుంది. కథ లేకపోవడం, నాసిరకమైన సీన్లు ఉండటం ఆడియెన్స్‌కి ఇబ్బందిగా మారింది.
మొత్తానికి గుంటూరు కారం చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం శ్రీలీలకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి మూవీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదు. అయితే శ్రీలీల ఆశలన్నీ పవన్ పైనే పెట్టుకుంది. అయితే ఆ సినిమా ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. శ్రీలీల మంచి డ్యాన్సర్‌తో పాటు అందం కూడా ఉంది. మరి ఇది రెండు అమ్మడిని నిలబెడతాయా లేదా అనేది చూడాలి.