విధాత, ప్రత్యేక ప్రతినిధి: అమ్మల( సమ్మక్క, సారలమ్మ) జాతర సందర్భంగా ఆదివాసీ బిడ్డ జ్ఞాపకంగా నిలిచిన స్థూపం కొత్తరంగులు అద్దుకున్నది. కొత్త అందాలతో ముస్తాబైన మేడారం జాతర వెలుగుల్లో ఈ పాత స్థూపం కూడా నూతన రంగులతో కాంతులీనుతోంది. పస్రా నుంచి వెళ్ళే వారికి నార్లాపురం, కొత్తూరు దాటగానే జంపన్న వాగుకు ముందు మూలమలుపు పై ఉండి స్వాగతం పలికే ఈ భారీ స్థూపం అందరినీ ఆకర్షిస్తోంది. చాలా కాలం క్రితమే ఈ స్థూపం నిర్మించినందున స్థానికుల నోట్లో ఈ సెంటర్ స్థూపం సెంటర్ గా నానుతోంది. నిన్నమొన్నటి వరకు ఎర్రరంగుతో కాసింత ఎలిసిపోయినట్లు కనిపించిన ఈ భారీ అమర జ్ఞాపకం తాజాగా కొత్త రంగులతో కనిపిస్తోంది. సమీపంలో ఐదు భాగాలుగా నిర్మించిన ఈ స్థూపంలో నాలుగు బాగాలకు ఆకుపచ్చని రంగు వేశారు. ఒక భాగానికి మాత్రం ఎర్రరంగు వేశారు. ఆ పైన సుత్తీకొడవలి భారీ చిహ్నం కనిపిస్తోంది. ఆదివాసీలకు ప్రతీకగా నిలిచే ఆకుపచ్చని రంగును ఈ స్థూపానికి వేయడం ఆసక్తికలిగించే అంశం. ఇది చర్చనీయాంశంగామారింది. ఎర్రని స్థూపమిప్పుడు ఆకుపచ్చ, ఎర్రని రెండు రంగులతో దర్శనిమిస్తోంది. ఈ వెనుక ఓ ఆదివాసీ బిడ్డ అమరత్వం ఉంది. మేడారానికి సమీప గ్రామమైన ఎలుబాకకు చెందిన మల్యాల సమ్మన్న అలియాస్ గుట్టన్న జనశక్తి, సీపీయుఎస్ఐ పార్టీలో నేతగా గుండాల, భూపాలపల్లి, ములుగు ఏరియాలో పనిచేశారు. విప్లవోద్యమ క్రమంలో ఆయన మృతి చెందడంతో ఆయన జ్క్షాపకార్ధం ఈ స్థూపం నిర్మించారు. కాలక్రమంలో ఆ పార్టీల ప్రాబల్యం తగ్గిన విషయం తెలిసిందే. ఆదివాసీ కోయ సామాజిక వర్గానికి చెందిన సమ్మన్న స్థూపం తాజాగా సమక్క జాతర సందర్భంగా రంగులద్దుకుని నూతనంగా ఆకట్టుకుంటోంది. ఆదివాసీ అమరుల జ్ఞాపకంగా నిటారుగా నిలిచింది.
ఇవి కూడా చదవండి :
Love Insurance : బాయ్‌ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
Gig Workers : భారత్ గిగ్ వర్కర్లకు ఊరట
Army Chief Upendra Dwivedi : ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
Cow vs Leopard Fight : చిరుతతో పోరాడి గెలిచిన ఆవు.. షాకింగ్ వీడియో
