Lachi Reddy | రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిలలో పదోన్నతులు కల్పించాలి

Lachi Reddy | భూ ప‌రిపాల‌న‌లో కాలానుగుణంగా వ‌స్తున్న మార్పులు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా రెవెన్యూ అధికారుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు రాష్ట్రంలో రెవెన్యూ అకాడ‌మీ ఏర్పాటు చేయాల‌ని, మెరుగైన భూప‌రిపాల‌న కోసం ఒక ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌(తెలంగాణ స్టేట్ సివిల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌) అభిప్రాయ‌ప‌డింది.

రాష్ట్రంలో రెవెన్యూ అకాడ‌మీ ఏర్పాటుచేయాలి
డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో తీర్మానాలు

Lachi Reddy | భూ ప‌రిపాల‌న‌లో కాలానుగుణంగా వ‌స్తున్న మార్పులు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా రెవెన్యూ అధికారుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు రాష్ట్రంలో రెవెన్యూ అకాడ‌మీ ఏర్పాటు చేయాల‌ని, మెరుగైన భూప‌రిపాల‌న కోసం ఒక ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌(తెలంగాణ స్టేట్ సివిల్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌) అభిప్రాయ‌ప‌డింది.

రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిలలో పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ లో ఉన్న సమస్యలను సైతం పరిష్కారం చేయాలని కోరారు. గ‌త రెండేళ్లుగా రెవెన్యూ శాఖ‌లో వ‌చ్చిన మార్పులు, ప్ర‌స్తుతం రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌లు, భ‌విష్య‌త్‌లో ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. హైద‌రాబాద్‌లో శనివారం డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో చేసిన తీర్మానాలను అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు.

స‌మావేశంలో చ‌ర్చించిన అంశాలు

స‌మాజ సేవ కోసం ప్రారంభించిన‌ ల్యాండ్ రెవెన్యూ ఎంప్లాయిస్ స‌పోర్ట్ స‌ర్వీస్‌(ఎల్ఆర్ఈఎస్ఎస్‌)కు త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందించి, మంచి కార్య‌క్ర‌మంలో భాగం కావాల‌ని అసోసియేష‌న్ స‌భ్యులు నిర్ణ‌యించి, మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కార్య‌క్ర‌మంలో అసోసియేష‌న్ గౌర‌వాధ్య‌క్షులు ర‌వి, స‌ల‌హాదారులు వెంక‌టాచారి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ర‌మేష్ రాథోడ్‌, వైస్ ప్ర‌సిడెంట్ శ్రీనివాస్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest News