ఎంత మంది యాంకర్స్ వచ్చిన, ఎవరు ఎంతగా అందాలతో రచ్చ చేయాలని చూసిన సుమ అంత స్టార్ యాంకర్ కాలేకపోతున్నారు. సుమ మలయాళీ అయినప్పటికీ తెలుగు చాలా చక్కగా నేర్చుకొని స్టార్ యాంకర్‌గా ఎదిగింది. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటే వాటికి సుమ తప్పనిసరిగా యాంకరింగ్ చేయాల్సిందే. అయితే ఈవెంట్‌లో చాలా కంట్రోల్‌గా మాట్లాడుతూ ఉండే సుమ ఈవెంట్లను రక్తి కట్టించడానికి హీరోలు, హీరోయిన్లను, ఆర్టిస్టులపై పంచులు విసిరుతూ అందరి దృష్టిని తనపై నిలుపుకొనేలా చేస్తుంటుంది. ఒక్కోసారి ఆమె వేసే పంచ్‌లు ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన, మరికొన్నిసార్లు మాత్రం బ్లాస్ట్ అవుతుంటాయి.
తాజాగా ఆదికేశవ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మీడియాపై యాంకర్ సుమ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఆదికేశవ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో సుమ మాట్లాడుతూ.. ‘బయట స్నాక్స్ ని భోజనంలా చేస్తున్న వారు లోపలికి రావాలి’ అని కౌంటర్ వేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలకి మీడియా ప్రతినిథులంతా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని అక్కడే సుమని ప్రశ్నించగా.. దానికి వేదికపై నుండే సారీ చెప్పింది సుమ.ఇక తాజాగా మరొక వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. క్షమాపణలు కోరింది.
ఈవెంట్ లో తను మాట్లాడిన మాటలకు విలేకర్లు అందరికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అంటూ పేర్కొంది. ఆదికేశవ ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు నాకు అర్ధమైంది. నిండు మనసుతో క్షమాపణ కొరుతున్నాను. మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని అనుకొంటున్నాను అని వీడియోలో సుమ చెప్పారు. ప్రస్తుతం సుమకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కొందరు నెటిజన్స్ సుమ తన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.