విధాత: నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉద్రిక్తత(Urmadla polling tension)కు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డిల(Kancharla vs Gutta clash)కు మధ్య పోలింగ్ కేంద్రం మాటల యుద్దం సాగింది. దీంతో పోలింగ్ కేంద్రం ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం(Gutta Sukhender Reddy family) స్వగ్రామం, కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) స్వగ్రామం కూడా ఉరుమడ్ల కావడం విశేషం. దీంతో ఈ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గురువారం పోలింగ్ సందర్బంగా గుత్తా కుటుంబం, భూపాల్ రెడ్డి ఇద్దరు కూడా గ్రామానికి చేరుకున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు అంతా కూడా ఇక్కడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా కంచర్ల భూపాల్ రెడ్డి సైతం అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాలు తారసపడటంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేసి ఉద్రిక్తతలు ముదరకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.
నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మాటల యుద్ధానికి దిగిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల… pic.twitter.com/pzrgHq54kI
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2025
