Site icon vidhaatha

Haleem | హ‌లీం తినాల‌ని ఉందా..? హైద‌రాబాద్‌లోని ఈ 10 సెంట‌ర్ల‌లో టెస్టీ సూప‌ర్..!

రంజాన్ మాసం ప్రారంభ‌మైందంటే చాలు హైద‌రాబాదీల‌కు హ‌లీం గుర్తుకు వ‌స్తోంది. ఘుమ‌ఘుమ‌లాడే హలీంను ఆర‌గించేందుకు ఆత్రుత ప‌డుతుంటారు. ఇక న‌గ‌ర వ్యాప్తంగా హ‌లీం బ‌ట్టిలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. మ‌ట‌న్, చికెన్ హ‌లీంల‌ను త‌యారు చేస్తూ.. ఆఫ‌ర్ల‌తో ఆహార ప్రియుల‌ను ఆక‌ర్షిస్తుంటారు. అయితే వంద‌ల సంఖ్య‌లో ద‌ర్శ‌న‌మిచ్చే హ‌లీం సెంట‌ర్ల‌లో కెల్లా.. ఈ ప‌ది సెంట‌ర్ల‌లో మాత్రం హ‌లీం సూప‌ర్ టెస్టీగా ఉంటోంది. ఈ సెంట‌ర్ల‌లో త‌యారు చేసే హ‌లీంకు భారీగానే డిమాండ్ ఉంటోంది. మ‌రి ఆ ప‌ది హ‌లీం సెంట‌ర్లు ఏవో తెలుసుకుందాం..

పిస్తా హౌస్ ( Pista House )

పిస్తా హౌస్ బ్రాంచెస్ న‌గ‌ర వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. పిస్తా హౌస్‌లో త‌యార‌య్యే హ‌లీంకు భారీ డిమాండ్ ఉంటోంది. మంచి నాణ్య‌త‌తో పాటు రుచిగా ఉంటోంది. ప్ర‌తి సెంట‌ర్ వ‌ద్ద హ‌లీంను తినేందుకు వంద‌ల సంఖ్య‌లో జ‌నాలు గుమిగూడి ఉంటారు. ప్ర‌స్తుతం ఒక ప్లేట్ హ‌లీంను రూ. 290కి విక్ర‌యిస్తున్నారు.

కెఫే బ‌హ‌ర్ ( Café Bahar )

కెఫే బ‌హ‌ర్ బ‌షీర్‌బాగ్‌లో ఉంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల నుంచి కెఫే బ‌హ‌ర్ మంచి క్వాలిటీతో హ‌లీంను అందిస్తోంది. ఇక్క‌డ మ‌ట‌న్ హ‌లీంకు డిమాండ్ ఎక్కువ‌. మ‌ట‌న్ హలీంను నెయ్యితో క‌లిపి త‌యారు చేస్తారు. ఇక్క‌డ హలీం ఆర‌గించాలంటే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జ‌నాలు అంత‌గా ఉంటారు.

షాదాబ్ ( Shadab )

షాదాబ్ పాత బ‌స్తీలో ఫేమ‌స్. ఇక్క‌డ హ‌లీం తిన్న త‌ర్వాత ఆ రుచిని మ‌రిచిపోరు. చికెన్ క‌బాబ్ నుంచి మ‌ట‌న్ బిర్యానీతో పాటు శాఖాహారం కూడా ల‌భిస్తోంది. సాయంత్రం నుంచి మొద‌లుకుంటే.. తెల్ల‌వారుజాము వ‌ర‌కు హాలీం అందుబాటులో ఉంటుంది.

కేఫే 555 ( Café 555 )

మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవ‌ర్ స‌మీపంలో కేఫే 555 ఉంటుంది. ఈ సెంట‌ర్‌లో మ‌ట‌న్ హ‌లీం ఫేమ‌స్. స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే మంచి రుచితో కూడిన హ‌లీం ల‌భించును. రాత్రి స‌మ‌యాల్లో ఇక్క‌డ ర‌ద్దీ అధికంగా ఉంటోంది. సింగిల్ ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ వ‌ర‌కు హాలీం దొరుకుతోంది.

బావ‌ర్చి ( Bawarchi )

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావ‌ర్చి సెంట‌ర్‌లో దొరికే హ‌లీం చాలా టెస్టీగా ఉంటుంది. ఈ హ‌లీం రుచి మ‌రెక్క‌డా ఉండ‌క‌పోవ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో ఇక్క‌డ ర‌ద్దీగా ఉంటుంది.

షా గౌస్ ( Shah Ghouse )

షా గౌస్ లో దొరికే హ‌లీంకు ప్ర‌త్యేక‌త ఉంది. జీడి ప‌ప్పు, ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు, వేయించిన ఉల్లిపాయ ముక్క‌ల‌తో హ‌లీంను త‌యారు చేస్తారు. ఇలాంటి కాంబినేష‌న్ హ‌లీం ఎక్క‌డా దొర‌క‌దు. నెయ్యితో కూడిన హ‌లీంను కూడా ఇక్క‌డ స‌ర‌ఫ‌రా చేస్తారు.

స‌ర్వీ రెస్టారెంట్ ( Sarvi Restaurant )

బంజారాహిల్స్‌లోని స‌ర్వీ రెస్టారెంట్ కూడా హ‌లీంకు ఫేమ‌స్. సామాన్యులే కాదు.. ఇక్క‌డ హ‌లీంను ఆర‌గించేందుకు సినిమా స్టార్‌లు కూడా వ‌స్తుంటారు. మ‌ట‌న్ హ‌లీం అద్భుతంగా ఉంటుంది.

బెహ్రూజ్ ( Behrouz )

బెహ్రూజ్ రెస్టారెంట్ మెహిదీప‌ట్నం, టోలీచౌకీలో ఉంది. ఇక్క‌డ హ‌లీం నోట్లో వేసుకోగానే ఐస్‌క్రీమ్‌లా క‌రిగిపోతోంది. ఇక్క‌డ ఘోస్ట్ హ‌లీం ఫేమ‌స్. నిజాం కాలం నుంచి ఇక్క‌డ హ‌లీం ఫేమ‌స్.

మెహ్‌ఫీల్ ( Mehfil )

నారాయ‌ణ‌గూడ‌లోని మెహ్‌ఫీల్ రెస్టారెంట్ కూడా హ‌లీంకు ఫేమ‌స్‌. సాయంత్రం స‌మ‌యంలో ఇక్క‌డ హ‌లీం తినేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. మ‌ట‌న్ హ‌లీం తినేందుకు జ‌నాలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు.

ప్యార‌డైస్ ఫుడ్ కోర్ట్ ( Paradise Food Court )

ప్యార‌డైస్ ఫుడ్ కోర్ట్ తెలియ‌ని వారుండ‌రు. ప్యార‌డైస్ హ‌లీం కూడా మంచి రుచిగా ఉంటుంది.


Exit mobile version