TRS
విధాత: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వేళ టిఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగు చూడడం సంచలనంగా మారింది. తెలంగాణ రాజ్యసమితి (TRS) పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేరింది. సిద్దిపేట జిల్లాకు చెందిన తుపాకుల బాలరంగం పార్టీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది.
టిఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి బాలరంగం సీఎం కేసీఆర్ మేనల్లుడైన రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావుకు నియోజకవర్గంలో ప్రధాన అనుచరుల్లో ఒకడు కావడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం కేసిఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ ఇటీవల బిఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిస్తూ బిఆర్ఎస్ నుంచి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తన కొడుకు కేటీఆర్ ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
అయితే రానున్న ఎన్నికల్లో హంగ్ పరిస్థితులు ఉత్పన్నమైన పక్షంలో సీఎం రేసులో తానుండే వ్యూహాల నేపథ్యంలోనే హరీష్ రావు తన ప్రధాన అనుచరుడి ద్వారా టిఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేయించారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.
అదే సమయంలో భవిష్యత్తులో మరెవరైనా టీఆర్ఎస్ ను సొంతం చేసుకోకుండా ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.
అయితే గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఎదురైన మాదిరిగా భవిష్యత్ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కు సైతం తన అల్లుడి నుంచి ముప్పు పొంచి ఉందన్న చర్చను టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు తతంగం రేకెత్తిస్తుంది.
ఏది ఏమైనా తెలంగాణ ప్రజల్లో టిఆర్ఎస్ పేరుకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత, అనుబంధం నేపథ్యంలో అదే పేరుతో హరీష్ రావు అనుచరుడే పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపినట్లయ్యింది.
అల్లుడా మజాకా
తెలంగాణ రాజ్య సమితి (TRS) పేరుతో కొత్త పార్టీ రిజిస్టేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్ళింది.
సిద్ధిపేట జిల్లా కి చెందిన తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు.
బాలరంగం మంత్రి తన్నీరు హరీష్ రావు కి అత్యంత సన్నిహితుడు ! pic.twitter.com/OFlv58AQPA
— Kalyan Dilli (@DilliKalyan) April 29, 2023