Site icon vidhaatha

తొలిసారి ఆ నొప్పి భ‌రించ‌లేక‌.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న బాలిక‌

ముంబై : అమ్మాయిలు కౌమార ద‌శ‌కు చేరుకోగానే వారిలో రుతుచ‌క్రం ప్రారంభ‌మవుతుంది. ఇది ప్ర‌తి అమ్మాయిలోనూ స‌ర్వ‌సాధార‌ణం. అయితే చాలా మంది అమ్మాయిల్లో రుతుచ‌క్రం వ‌చ్చే స‌మ‌యంలో ఆ నొప్పి భ‌రించ‌లేనంత‌గా ఉంటుంది. పీరియ‌డ్స్ పెయిన్‌ను భ‌రించ‌లేక అమ్మాయిలు బాధ‌ప‌డుతూ ఉంటారు. కొంద‌రైతే ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ 14 ఏండ్ల బాలిక‌ కూడా రుతుస్రావం నొప్పిని భ‌రించ‌లేక సూసైడ్ చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలోని మ‌ల్వానికి చెందిన ఓ 14 ఏండ్ల బాలికకు ఇటీవ‌లే తొలిసారిగా పీరియ‌డ్స్ వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో ఆమెకు భ‌రించ‌లేనంత నొప్పి వ‌చ్చింది. ఆ పెయిన్‌ను భరించ‌లేక‌, ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం రాత్రి చోటు చేసుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రుతుస్రావం నొప్పి వ‌ల్లే బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఇక ఆమె సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను కూడా పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. బాలిక ఆత్మ‌హ‌త్య‌కు ఇత‌ర కార‌ణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Exit mobile version