Site icon vidhaatha

B-Form | బీ-ఫారం అంటే ఏమిటి..? ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు ఎందుకు ఇస్తారు..?

B-Form | ఎన్నిక‌లు రాగానే ప్ర‌ధాన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తారు. అభ్య‌ర్థుల జాబితాల‌ను ఒకేసారి లేదా విడుత‌ల వారీగా విడుద‌ల చేస్తారు. జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఆ అభ్య‌ర్థి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. స‌ద‌రు అభ్య‌ర్థికి.. ఏ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారో.. ఆ రాజ‌కీయ పార్టీ బీ-ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు వీలుంటుంది. త‌మ పార్టీ అభ్య‌ర్థి ఇత‌నే అని అధికారికంగా తెలియ‌జేసేందుకు బీ-ఫారంను అంద‌జేస్తుంటారు. ఇలా బీ-ఫారాలు పొందిన అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే సంబంధిత పార్టీ అభ్య‌ర్థులుగా ఎన్నిక‌ల సంఘం గుర్తిస్తుంది.

బీ-ఫారం అంటే..?

గుర్తింపు పొందిన జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు త‌మ పార్టీ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు వీరేన‌ని గుర్తించేలా ఇచ్చేదే బీ-ఫారం. నామినేష‌న్ వేసే స‌మ‌యంలో ఎన్నిక‌ల అధికారులు ఈ ఫారాన్ని స‌మ‌ర్పిస్తేనే పార్టీకి సంబంధించిన ఎన్నిక‌ల గుర్తును సద‌రు అభ్య‌ర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌త్యేకంగా నియ‌మితులైన ప్ర‌తినిధుల ద్వారా బీ-ఫారాన్ని అందిస్తారు. 

Exit mobile version