Site icon vidhaatha

కృష్ణ చనిపోతే.. ఎందుకు బాధ పడుతున్నారు?: RGV

విధాత: సాహసానికి మారు పేరైన సూపర్ స్టార్ కృష్ణ మరణంతో.. టాలీవుడ్‌లో ఒక శకం ముగిసినట్లుగా ఇండస్ట్రీ భావిస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా గోల్డెన్ హీరోలందరూ ఇండస్ట్రీని వదలివెళ్లిపోతుండ‌డంతో ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త మరువక ముందే.. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త వినాల్సి రావడం నిజంగా బాధాకరమైన విషయం.

సూపర్ స్టార్ మృతికి పలువురు నివాళులు అర్పిస్తుంటే.. సంచలన దర్శకుడు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ.. కృష్ణగారి మృతితో బాధపడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్‌తో షాకిచ్చారు. నిజంగా ఇలాంటి సందర్భంలో కూడా ఆ తరహా ట్వీట్స్ చేయడం ఒక్క వర్మకే సాధ్యం.

Exit mobile version