Site icon vidhaatha

Axis Bank | కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన యాక్సిస్‌ బ్యాంక్‌.. ఎఫ్‌డీలపై భారీగానే వడ్డీ పెంపు..!

Axis Bank | దేశానికి చెందిన ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంకు అయిన యాక్సిస్‌ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.2కోట్లలోపు విలవైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన వడ్డీ రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. 17 నెలల నుంచి 18 నెలలలోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పది బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు చెప్పింది. బ్యాంకు ప్రస్తుతం 7 రోజుల నుంచి పదేళ్లలోపు కాల పరిమితి ఉన్న ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 3శాతం నుంచి 7.20శాతం వరకు, సీనియర్‌ సిటిజన్లకు 3.5శాతం నుంచి 7.85శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నది. 17 నెలల నుంచి 18 నెలల లోపు కాలపరిమితి ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు గరిష్ఠంగా 7.20శాతం, సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 7.85శాతం వడ్డీ రేటును బ్యాంకు చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీను యాక్సిస్‌ బ్యాంక్‌ చెల్లిస్తున్నది.

కాలపరిమితి.. వడ్డీ రేట్లు ఇలా..

Exit mobile version