Site icon vidhaatha

‘యాక్సిస్ నిఫ్టీ AAA బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్’ ఆవిష్కరణ‌

ముంబై: భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫండ్ హౌస్‌లలో ఒకటైన యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ AAA బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది, నిఫ్టీ AAA ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటుంది. దీనికి ఫండ్ మేనేజరుగా హార్దిక్ షా వ్యవహరిస్తారు. ఈ న్యూ ఫండ్‌కి నిఫ్టీ AAA ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీస పెట్టుబడి మొత్తం రూ. 5,000 కాగా ఆ తర్వాత నుంచి రూ. 1/- గుణిజాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఎన్‌ఎఫ్‌వో వ్యవధి 2025 ఫిబ్రవరి 27 నుంచి 2025 మార్చ్ 04 వరకు ఉంటుంది.

“విస్తృతమైన మా ప్యాసివ్ డెట్ పథకాలకు యాక్సిస్ నిఫ్టీ AAA బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్ మరో కీలకమైన జోడింపు కాగలదు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అత్యంత నాణ్యమైన, AAA-రేటింగ్ గల సెక్యూరిటీల్లో మదుపు చేసేందుకు ఈ కొత్త స్కీము అవకాశం కల్పించగలదు. ఈ టార్గెట్ మెచ్యూరిటీ స్వరూపం ద్వారా అంచనాలకు అందే విధమైన, స్థిరమైన పెట్టుబడి సాధనాన్ని అందించాలనేది ఫండ్ లక్ష్యం. ఫండ్ కాలవ్యవధిలో రిస్కులు మరియు రాబడుల మధ్య సమతౌల్యాన్ని పాటించాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వినూత్న పథకాలను అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఇన్వెస్టర్ల వైవిధ్యమైన అవసరాలను తీరుస్తూ తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్‌ను అందించడంలో మా నిబద్ధతకు ఈ ఫండ్ నిదర్శనంగా ఉండగలదు” అని యాక్సిస్ ఏఎంసీ ఎండీ & సీఈవో Mr. బి. గోప్‌కుమార్ తెలిపారు. రింత సమాచారం కోసం www.axismf.com. సందర్శించాలి.

ఫండ్ ప్రత్యేకతలు:

• బెంచ్‌మార్క్: నిఫ్టీ AAA ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్

• స్కీము మెచ్యూరిటీ అంచనా తేదీ: 31 మార్చ్ 2028

• NFO తేదీ: 27 ఫిబ్రవరి 2025 నుంచి 04 మార్చ్ 2025 వరకు

• కనీస పెట్టుబడి: రూ. 5,000 మరియు ఆ తర్వాత నుంచి రూ. 1/- గుణిజాల్లో

• ఫండ్ మేనేజరు: హార్దిక్ షా

• ఎగ్జిట్ లోడ్: నిల్

(ఇది నిఫ్టీ AAA ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఒక ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఇందులో ఒక మోస్తరుగా వడ్డీ రేటు రిస్కు, మిగతా వాటితో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటాయి)

Exit mobile version