Bank Holidays in December | బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. మరో ఐదు రోజుల్లో నవంబర్( November ) మాసం ముగిసి.. డిసెంబర్( December ) రానుంది. ఈ డిసెంబర్ నెలలో బ్యాంకులకు సగం రోజులకు పైగా సెలవులు( Bank Holidays ) ఉన్నాయి. కాబట్టి లావాదేవీలు, కొత్త ఖాతాల ఓపెనింగ్స్, ఇతర పనుల నిమిత్తం అప్రమత్తంగా ఉండి.. పని దినాల్లో పనులు చక్కబెట్టుకోవడం మంచిది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ మాసంలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.
డిసెంబర్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..
డిసెంబర్ 1(సోమవారం) – స్వదేశీ విశ్వాస దినోత్సవం(అరుణాచల్ ప్రదేశ్)
డిసెంబర్ 3(బుధవారం) – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్(గోవా)
డిసెంబర్ 5(శుక్రవారం) – షేక్ మహమ్మద్ అబ్దుల్లా జయంతి(జమ్మూకశ్మీర్)
డిసెంబర్ 12(శుక్రవారం) – పా టోగన్ నెంగ్మింగా సంగ్మా(మేఘాలయ)
డిసెంబర్ 13(రెండో శనివారం) – దేశ వ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 18(గురువారం) – ఉ సోసో థామ్ వర్థంతి(మేఘాలయ)
డిసెంబర్ 18 (గురువారం) – గురు ఘాసిదాస్ జయంతి(ఛత్తీస్‌గఢ్)
డిసెంబర్ 19(శుక్రవారం) – విముక్తి దినోత్సవం(డామన్ డయ్యూ, గోవా)
డిసెంబర్ 24(బుధవారం) – క్రిస్మస్ హాలీడే(మేఘాలయ, మిజోరం)
డిసెంబర్ 25(గురువారం) – క్రిస్మస్
డిసెంబర్ 26 (శుక్రవారం) – షహీద్ ఉధమ్ సింగ్ జయంతి(హర్యానా)
డిసెంబర్ 27(శనివారం) – నాలుగో శనివారం(దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
డిసెంబర్ 30(మంగళవారం) – ఉ కియాంగ్ నంగ్బా(మేఘాలయ)
