Bank Holidays in November | న‌వంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 12 రోజులు సెల‌వులు.. జాబితా ఇదే..!

Bank Holidays in November | నేటితో అక్టోబ‌ర్( October ) నెల ముగియ‌నుంది. రేప‌ట్నుంచి అంటే శ‌నివారం నుంచి న‌వంబ‌ర్( November ) నెల ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) న‌వంబ‌ర్ మాసానికి సంబంధించి బ్యాంకు సెలవుల( Bank Holidays ) జాబితాను విడుద‌ల చేసింది.

Bank Holidays in November | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve bank of India ) సెల‌వుల జాబితా ప్ర‌కారం.. దేశంలోని వివిధ బ్యాంకుల‌కు 12 రోజుల పాటు సెల‌వులు( Bank Holidays ) రానున్నాయి. ఈ సెల‌వుల్లో కొన్ని నేష‌న‌ల్ హాలీడేస్( National Holidays ) కాగా, మ‌రికొన్ని రీజిన‌ల్ హాలిడేస్( Regional Holidays ) ఉన్నాయి.

న‌వంబ‌ర్ నెల‌లో మొత్తం 12 రోజులు సెల‌వులు వ‌స్తుండ‌డంతో ఖాతాదారులు అప్ర‌మ‌త్తంగా ఉంటే బెట‌ర్. సెల‌వుల‌ను దృష్టిలో ఉంచుకుని, త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా బ్యాంకింగ్ కార్య‌క‌ల‌పాల‌ను ప్లాన్ చేసుకుంటే మంచిది. మ‌రి సెల‌వుల జాబితా చూద్దాం.

బ్యాంకుల‌కు న‌వంబ‌ర్‌లో సెల‌వులు ఇవే..( Bank Holidays in November )

నవంబర్​ 1 (శనివారం) : కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో, ఇగాస్​-బగ్వాల్ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని బ్యాంకులకు సెలవు.
నవంబర్​ 2 (ఆదివారం) :
నవంబర్​ 5 (బుధవారం) : గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు.
నవంబర్​ 7 (శుక్రవారం) : వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో (ముఖ్యంగా) షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవులు.
నవంబర్​ 8 (శనివారం) : కనకదాస జయంతి, రెండో శనివారం సందర్భంగా కర్ణాటక సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్​ 9 (ఆదివారం) :
నవంబర్​ 11 (మంగళవారం) : లహాబ్​ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు హాలీ డే
నవంబర్​ 16 (ఆదివారం) :
నవంబర్​ 22 (శనివారం) : నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్​ 23 (ఆదివారం) :
నవంబర్​ 25 (మంగళవారం) : గురు తేగ్​ బహదూర్​ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్​, హరియాణా, చండీగఢ్​లలో బ్యాంకులకు సెలవు
నవంబర్​ 30 (ఆదివారం) :