2026 Bank Holidays | హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. అంటే 2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో ఇప్పటికే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సెలవుల జాబితా విడుదలైంది. ఇక మిగిలింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( reserve Bank of India ) క్యాలెండరే. ఆ ఆర్బీఐ క్యాలెండర్( RBI Calendar ) కూడా విడుదలైంది. దీంతో ఖాతాదారులు( Customers ) అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడుతాయో( Bank Holidays ) తెలుసుకోంటే.. లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలు ముందే చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ, ఏపీలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూత పడనున్నాయో తెలుసుకుందాం.
2026లో బ్యాంకులకు సెలవులు ఇవే..
జనవరిలో
15 – సంక్రాంతి
26 – రిపబ్లిక్ డే
మార్చి
3 – హోలీ
19 – ఉగాది
20 – రంజాన్
27 – శ్రీరామనవమి
ఏప్రిల్
1 – ఆర్థిక సంవత్సరం ప్రారంంభం
3 – గుడ్ ఫ్రైడే
14 – అంబేద్కర్ జయంతి
మే
1 – మే డే
27 – బక్రీద్
జూన్
26 – మొహర్రం
ఆగస్టు
15- స్వాతంత్య్ర దినోత్సవం
26 – మిలాద్ ఉన్ నబీ
సెప్టెంబర్
4 – శ్రీకృష్ణ జన్మాష్టమి
14 – వినాయక చవితి
అక్టోబర్
2 – గాంధీ జయంతి
20 – దసరా
నవంబర్
8 – దీపావళి
24 – గురునానక్ జయంతి
డిసెంబర్
25 – క్రిస్మస్
