Budget 2024 | కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించనున్నది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3.O బడ్జెట్‌పై ఈ సారి భారీగా అంచనాలున్నాయి. తమకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా ? అని వివిధ రంగాలతో పాటు ప్రముఖులు.. తమకు ఏదైనా వరాలు ప్రకటిస్తారా? అని మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా? లేదా? ఆసక్తి నెలకొన్నది. అయితే, బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఏవైనా ప్రకటన చేస్తారా? ఏమైనా ధరలు తగ్గుతాయా? అని ఆలోచిస్తున్నారు. భారత్‌లో మొబైల్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం గత ఏడాది కెమెరా లెన్స్‌లు తదితర కీలక భాగాలపై దిగుమతి పన్నులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. అదనంగా లిథియం అయాన్ బ్యాటరీలపై తగ్గించిన పన్ను రేట్లను పొడిగించిన విషయం తెలిసిందే.
ఇవి స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఈవీ వాహనాల తయారీలో ఎంతో కీలకం. ఈ క్రమంలో బడ్జెట్‌లో మొబైల్ తయారీ రంగం మరింత ప్రోత్సాహకాలను కోరుతున్నది. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో తయారీ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని పునః పరిశీలించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా మొబైల్ తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ పీఎల్ఐ పథకం దేశీయ ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీలను అందివ్వనున్నది. ప్రపంచవ్యాప్తంగా భారత తయారీ వస్తువుల పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు పెద్ద ఎత్తున తయారీని ప్రోత్సహించడం, ఆశాజనక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం. భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలపై ఈ స్కీమ్ దృష్టి సారిస్తున్నది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్‌తో పాటు 14 కీలక రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌ను విస్తరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా నిపుణులు పేర్కొటున్నారు.