Gold Prices | దసరా పండుగ( Dasara Festival ) వేళ మహిళలకు ఇదొక సువర్ణావకాశం. నాలుగైదు రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు( Gold Prices ) స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్టోబర్ 8వ (మంగళవారం) తేదీన బంగారం ధరలు భారీగా తగ్గాయి. అలాగే వెండి ధరల్లో( Silver Prices ) కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
ఇక ఈ రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ. 230 వరకు తగ్గింది. దీంతో ఇండియా( India )లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.77,440గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.70,099గా ఉంది. ఇక హైదరాబాద్( Hyderabad ) నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,990గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,440గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,590గా ఉంది. అటు చెన్నై బులియన్ మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,440గా ఉంది.
వెండి ధరల్లోనూ హెచ్చుతగ్గులు..
గడిచిన రెండు రోజులుగా వెండి ధరల్లోనూ( Silver Prices ) హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా రెండు వేలకుపైగా పెరిగిన వెండి ధరలు.. మంగళవారం మరోసారి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 96,800గా ఉంది. ముంబై, పూణేలలో కిలో వెండి రూ. 96,800గా.. ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 96,900గా.. చెన్నై, హైదరాబాద్, కేరళ నగరాల్లో కిలో వెండి రూ. 1,02, 900గా ఉంది.