Car Millage : చాలామంది వివిధ అవసరాల నిమిత్తం ఎంతో ఉత్సాహంగా కారును కొనుగోలు చేస్తారు. కానీ దాని మెయింటెనెన్స్‌లో మాత్రం చాలా పొరపాట్లు చేస్తారు. కొత్తగా డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ (Car Tips) గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారికి ఈ టిప్స్ తప్పక తెలియాలి. ఇంతకూ ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చాలామందికి కారు కొనడానికి ముందే డ్రైవింగ్ గురించి తెలిసి ఉంటుంది. కానీ కొందరు కారు కొనుగోలు చేసిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంటారు. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు కారును ఎలా వాడాలో తెలుసుకొని వెహికల్‌ను జాగ్రత్తగా చూసుకుంటారు. దీంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కొత్తగా కారు నడిపేవారు ఇష్టమొచ్చిన రీతిలో డ్రైవింగ్ చేస్తుంటారు. దాంతో మైలేజ్ రాదు. పైగా ఇంజిన్ దెబ్బతింటుంది.
కారు వాడేవారు తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఎక్సలేటర్, బ్రేక్ తక్కువసార్లు ఉపయోగించడం. అంటే ఒకే రీతిలో సాఫీగా వెళ్లాలి. దాంతో ఇంజిన్‌పై ప్రభావం పడకుండా ఉంటుంది. గంటల తరబడి ఒకేచోట కారు ఆగినప్పుడు కారును ఆఫ్ చేయడం మంచిది. ఆన్‌లోనే ఉంచడం వల్ల కారు వేడి కావొచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఆగినప్పుడు సైతం కారును ఆఫ్ చేయడం మంచిది. ట్రాఫిక్‌లో ముందున్న వాహనాలకు చాలా దూరంగా ఉండాలి.
కారు ఎక్సలేటర్‌ను వేగంగా పెడలింగ్ చేయడంవల్ల మైలేజ్ తగ్గుతుంది. హెచ్చు, తగ్గులు ఎక్కువగా ఉండడంవల్ల మైలేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది. డ్రైవింగ్ కామన్‌గా ఉండటంవల్ల మంచి మైలేజ్ వస్తుంది. కారు టైర్లు బాగా లేకపోవడం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. కారు టైర్లు నాణ్యంగా లేకపోతే స్లోగా రన్ అవుతుంది. దాంతో మైలేజ్ తగ్గుతుంది.
కారులోని ఏసీని వాతావరణాన్ని భట్టి ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. చల్లని వాతావరణంలో ఏసీని ఆప్ చేసుకోవడంవల్ల మైలేజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.