Mega 158 | మెగా 158: మల్టీ ‘మెగా’స్టారర్.! చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158 చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్‌లాల్ కీలక పాత్రలో, ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లు సంచలన సమాచారం. రహమాన్​ సంగీతంతో భారీ బడ్జెట్‌, స్టార్ క్యాస్టింగ్‌, మాస్ యాక్షన్ కథతో ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా మారే అవకాశం ఉంది.

Chiranjeevi, Aishwarya Rai, Mohanlal and AR Rahman featured together in a promotional collage linked to Mega 158 casting buzz.

Mega 158: A Massive Star Lineup? Aishwarya Rai, Mohanlal & AR Rahman with Chiranjeevi?

✔️ సంక్షిప్తంగా

మెగాస్టార్​ చిరంజీవి  నటిస్తున్న Mega 158 చుట్టూ భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. మోహన్‌లాల్, ఏఆర్ రెహమాన్ వంటి స్టార్స్​ పేర్లు కూడా జాబితాలో ఉండటంతో సినిమా మల్టీ-మెగాస్టారర్ స్థాయికి చేరింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ టాలీవుడ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

 

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

Mega 158 | మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మళ్లీ తన అసలైన​ ఫామ్‌లోకి వచ్చారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఘనవిజయంతో ఆయన క్రేజ్ మళ్లీ అమాంతం పెరిగింది. ఇదే ఉత్సాహంలో తదుపరి చిత్రం స్టార్​ కాస్ట్​ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది బాబీ కొల్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చుట్టూ రోజూ కొత్త రూమర్లు, కొత్త అప్‌డేట్‌లు పుడుతూ అభిమానుల్లోనే కాక, పరిశ్రమలోనే విపరీతమైన ఆసక్తి పెంచుతున్నాయి.

ఇండస్ట్రీ టాప్​ స్టార్ల కలయిక? 

సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు మెగా 158ను రస్టిక్ మాస్ గ్యాంగ్​స్టర్​ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. కేవీఎన్​ ప్రొడక్షన్స్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టరే విభిన్నంగా ఉంది. ఇందులో చిరంజీవి పూర్తిగా కొత్త లుక్‌తో కనిపించనున్నట్లు టాక్ ఉంది. కథలో మాస్, సీరియస్​ ఎమోషన్లకు బాబీ పెద్దపీట వేసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సినిమాలో మరో పెద్ద స్టార్ హీరో ఉండబోతున్నారన్న వార్తలు కూడా హీట్ పెంచుతున్నాయి. మొదట కార్తీ పేరు వినిపించగా, ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఆ కీలక పాత్రలో నటించనున్నారని తెలిసింది. చిరకాల మిత్రుడు చిరంజీవి చిత్రం అనగానే మోహన్​లాల్​ వెంటనే ఒప్పుకున్నట్లు, చిరంజీవి కూడా ఫోన్​ చేసి కృతజ్ఞతలు చెప్పనట్లు సమాచారం.  అలాగే బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్ కూడా నెగిటివ్ లేదా స్పెషల్ రోల్‌లో కనిపిస్తారనేది కూడా దాదాపు కన్​ఫర్మే.

సాంకేతిక నిపుణుల వైపు కూడా భారీ పేర్లు పరిశీలిస్తున్నారట. మాలీవుడ్ డీఓపీ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ చేసే అవకాశం ఉంది. ఇక ఆయువుపట్టైన సంగీతం కోసం ఏఆర్ రెహమాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇది కూడా దాదాపుగా కొలిక్కివచ్చినట్లేనని తెలిసింది. పెద్ది మ్యూజిక్​తో సంచలనం సృష్టించిన మ్యూజిక్​ మెగాస్టార్​ రెహమాన్​ కూడా చిరంజీవి సినిమాకు సంగీతం ఇవ్వాలని ఎప్పటినుండో అంటున్నాడు. ఈ సినిమాతో ఆ కోరిక తీరనుంది.

ఐశ్వర్య రాయ్ నాయికగా..!ఇదే ఇప్పుడు షేకింగ్​ న్యూస్​

ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది ఐశ్వర్య రాయ్ పేరు. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ టాప్ నటి అయిన ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఆమె హీరోయిన్‌గా వస్తుందా? లేక స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్‌లోనా? అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేకపోయినా, సినీ జనాలు మాత్రం కథానాయికగానే నటించబోతోందని వినికిడి.

ఈ తొలి కలయిక తెలుగు పరిశ్రమలో విపరీతమైన సంచలనానికి దారితీసింది. మామయ్య అమితాబ్​ బచ్చన్​, మెగాస్టార్​కు గురుతుల్యులనే విషయం తెలిసిందే. అదీకాక, ఐశ్వర్యకు చిరంజీవితో నటించలేదనే లోటు ఒకటెలాగూ ఉంది. ఈ రెండు విషయాలు ఐశ్వర్య తెలుగు సినీ ప్రవేశానికి కారణమయ్యాయని చిరంజీవి సన్నిహిత వర్గాల భోగట్టా.

వినిపిస్తున్న కొన్ని వార్తల ప్రకారం, ఈ సినిమాకు ఐశ్వర్య రాయ్​కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ముట్టబోతోందని తెలుస్తోంది. సుమారు రూ.20 కోట్లకు పైగా, షూటింగ్ రోజుల ఖర్చులు, వ్యక్తిగత సిబ్బంది వ్యయాలు కూడా నిర్మాతలు భరించాలనే షరతులు ఉన్నట్లు సమాచారం. నిర్మాతలు కూడా వెనకాముందు చూడకుండా ఒప్పుకున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

గతంలో ఒక తెలుగు పాటలో నటించిన ఐశ్వర్య రాయ్​కిది తొలి పూర్తి స్థాయి తెలుగు చిత్రం కావడం విశేషం.

చిరంజీవి ఇప్పుడు ఏం చేస్తున్నారు?

మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత మెగాస్టార్ విశ్వంభర కోసం సిద్ధమవుతున్నారు. గ్రాఫిక్స్​ పనుల్లో నిమగ్నమై ఉన్న ఈ చిత్రం పనులను దగ్గరుండి చూసుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మన శంకరవరప్రసాద్​ గారు ఘనవిజయంతో, విశ్వంభరను కూడా ప్రేక్షకులు మంత్రముగ్థులయ్యేలా ప్రజెంట్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రం వేసవి సెలవుల్లో విడుదల కానుంది. అంతకుముందే మెగా 158 ట్టాలెక్కుతుందని లెక్కలు వేస్తున్నారు. బాబీ–చిరు కాంబినేషన్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ కావడంతో, ఈసారి కూడా అటువంటి భారీ వినోదాన్ని ఇచ్చేందుకు టీమ్ పెద్ద ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరూ రాజీపడే ప్రసక్తే లేదని హీరో, దర్శకుడు, నిర్మాత గట్టిగా తీర్మానించుకున్నట్లు సమాచారం.

మొత్తం మీద రూమర్లు, స్టార్ క్యాస్టింగ్‌, భారీ బడ్జెట్‌, బాబీ స్టైల్—అన్నీ కలిసి మెగా 158 ను చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది.

Latest News