Kajra Re | పెళ్లి( Marriage ) వేడుకల్లో మెహందీ ఫంక్షన్( Mehendi Function ) కామన్ అయిపోయింది. వివాహ వేడుకలో భాగంగా మెహందీ ఫంక్షన్( Mehendi Function ) నిర్వహిస్తున్నారు. అటు పెళ్లి కూతురు( Bride ), ఇటు పెళ్లి కుమారుడికి( Bride Groom ) తమతమ కుటుంబ సభ్యులు మెహందీ వేడుకలు నిర్వహిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మెహందీ వేడుకల్లో వధూవరుల కుటుంబ సభ్యులు డ్యాన్స్( Dance )లు చేస్తూ సందడి చేస్తున్నారు.
ఓ మెహందీ వేడుక( Mehendi Function )ల్లో ఓ ముసలావిడ( Elderly Woman ) చేసిన డ్యాన్స్( Dance ) అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. దాదాపు 80 ఏండ్ల వయసున్న ఆ వృద్ధురాలు ఐశ్వర్యరాయ్( Aishwarya Rai ) కజ్రా రే(Kajra Re ) సాంగ్‌కు స్టెప్పులు వేడయం నెటిజన్లను ఎంతో కట్టిపడేసింది. ఏం ఎనర్జీ అంటూ కితాబిస్తున్నారు. ఆమె నృత్యానికి ఫిదా అయిపోయి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐశ్వర్యరాయ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా బామ్మ గారు స్టెప్పులేశారని ప్రశంసిస్తున్నారు.
తనలో కల ఉంటే వయసు అడ్డు రాదనే దానికి ఈ వృద్ధురాలే నిదర్శనం అని నెటిజన్లు అంటున్నారు. వృద్ధ వయసులోనే ఆమె స్లో మోషన్‌లో వేసిన స్టెప్పులు ఎంతో ఆకట్టుకున్నాయి. కుటుంబ సభ్యులు కూడా బామ్మ గారిని ఎంకరేజ్ చేస్తూ ఆమెతో సరదాగా స్టెప్పులేసి గొప్ప అనుభూతిని పొందారు. ప్రస్తుతం ఈ బామ్మ గారి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 6.9 మిలియన్ల మంది వీక్షించారు.
అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan ), అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ), రాణి ముఖర్జీ నటించిన బంటీ ఔర్ బబ్లీ( Bunty Aur Babli ) మూవీలోని పాటనే కజ్రా రే( Kajra Re ). ఈ చిత్రం 2005లో విడుదలైంది. కాగా కజ్రా రే పాటను గుల్జార్( Gulzar ) రాయగా, అలిషా చినోయ్, శంకర్ మహదేవన్( Shankar Mahadevan ), జావేద్ అలీ ఆలపించారు.