Site icon vidhaatha

EPFO | ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ రూ.లక్షకు పెంపు..!

EPFO | ఉద్యోగులను భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. ఫారం 31, ఫారం 68జే విత్‌డ్రా లిమిట్‌ను రూ.50వేల నుంచి రూ.లక్షలకు పెంచింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌కు ఈ నెలలో ఈపీఎఫ్‌ఓ మార్పులు చేసింది. దీనికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) ఆమోదం సైతం లభించినట్లు ఈపీఎఫ్‌వో సర్క్యూలర్‌లో పేర్కొంది. ఫారం 31 ద్వారా ఉద్యోగులు పీఎఫ్ ఖాతా నుంచి వివిధ కారణాల కోసం పాక్షిక విత్‌డ్రా కోసం క్లెయిమ్‌ చేసుకునే వెలుసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి, లోన్‌ రీపేమెంట్‌, ప్లాట్‌ కొనుగోలు తదితర కారణాలతో ఉద్యోగులు పాక్షింగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. 68జే ఫారం ద్వారా ఉద్యోగి ఆరోగ్యం, కుటుంబీకుల ఆరోగ్య సమస్యలతో చికిత్స కోసం అడ్వాన్స్‌గా పొందవచ్చు. అయితే, మొన్నటి వరకు లిమిట్‌ రూ.50వేలు ఉండగా.. దీన్ని రూ.లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అయితే, ఉద్యోగి ఆరు నెలల కనీస వేతసం, డీఏకు మించకూడదని నిబంధనను విధించింది. రెండింటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇందుకు ఉద్యోగులు ఫారం 31తో పాటు డాక్టర్ సంతకం చేసిన ‘సర్టిఫికేట్- సీ’ని సైతం అందించాల్సి ఉంటుంది.

అసలేంటీ ఫారం 31?

ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి పాక్షికంగా ఉపసంహరణ కోసం ఉద్యోగులు ఫారం 31ని అందించాల్సి ఉంటుంది. దీన్ని పీఎఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఫారం అని కూడా పిలుస్తుంటారు. ఖాతా నుంచి రుణాలు, విత్‌డ్రాలు, అడ్వాన్సు కోసం వినియోగిస్తుంటారు. ఫారం 98బీ ద్వారా ఇల్లు, ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు.. 68బీబీ ద్వారా లోన్లు తిరిగి చెల్లించేందుకు, 68హెచ్‌ ద్వారా ప్రత్యేక సందర్భాల్లో అడ్వాన్సులు, 68 జే ద్వారా వైద్య చికిత్స కోసం అడ్వాన్స్‌, 98కే ద్వారా పెళ్లిళ్లు, పిల్లల పైచదువులకు కోసం అడ్వాన్స్‌లు తీసుకోవచ్చు. 68ఎన్‌ ద్వారా దివ్యాంగులతో పాటు ఉద్యోగులు ఉద్యోగ విరమణకు ఏడాది ముందు 68ఎన్‌ ద్వారా పీఎఫ్‌ ఖాతా నుంచి విత్‌డ్రాకు ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం 68జే ద్వారా విత్‌డ్రా పరిమితి రూ.50వేల వరకు ఉన్నది. దీన్ని రూ.లక్షకు పెంచుతూ ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగితో పాటు కుటుంబీకులు చికిత్స కోసం అడ్వాన్స్‌గా తీసుకునే సౌలభ్యం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈపీఎఫ్‌ఓ పీఎఫ్‌ ఖాతాల బదిలీని ఆటోమేటిక్‌గా మార్చింది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ ఖాతా కూడా ఆ కంపెనీకి ఆటోమేటిక్‌గా మారుతుంది. ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

 

Exit mobile version