ఐఫోన్‌ కొనాలనుకుంటున్నారా గురూ..! ఇంతకన్నా తక్కువ ధరకు రాదేమో..! ఛాన్స్‌ మిస్సవ్వొద్దు..!

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అతితక్కువ ధరకే ఐఫోన్‌ను మీ సొంతం చేసుకునే ఛాన్స్‌ వచ్చింది

  • Publish Date - November 14, 2023 / 05:07 AM IST

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అతితక్కువ ధరకే ఐఫోన్‌ను మీ సొంతం చేసుకునే ఛాన్స్‌ వచ్చింది. వాస్తవానికి ఐఫోన్‌ ధరలు భారీగా ఉంటాయి. అయితే, దీపావళి సేల్స్‌ ముగిసినా కొన్నింటిపై ఈ కామర్స్‌ సంస్థలు భారీగా ఆఫర్స్‌ ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌-12పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.


అలాగే బ్యాంక్‌ క్రెడిట్‌కార్డులు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 64 జీబీ వేరియంట్‌ ఐఫోన్‌-12పై భారీగా తగ్గింపు ఆఫర్‌ ఫ్లిప్‌కార్డ్‌ ప్రకటించింది. ఈ మోడల్‌ ధర రూ.39,999 సొంతం చేసుకునే వీలు కల్పించింది. వాస్తవానికి ఈ మోడల్‌ ధర రూ.49,900 కాగా.. 19శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నది.


ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డుతో కొనుగోలు చేసే మరో 5శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ వర్తించనున్నది. దాంతో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.35వేల వరకు ధర తగ్గనున్నది. అయితే, మీరు ఎక్స్‌ఛేంజ్‌ చేయబోయే మోడల్‌, లొకేషన్‌బట్టి ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూ ఆధారపడి ఉంటుంది.


ఒక మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే.. ఐఫోన్​ 12లో 6.1 ఇంచ్​ సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లేతో వస్తుంది. 12ఎంపీ డ్యూయెల్​ లెన్స్​ సిస్టమ్‌, 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఏ14 బయోనిక్ ​ప్రాసెసర్​, సెరామిక్​ షీల్డ్​ టెక్నాలజీ ఉంటుంది. ఐపీ68 వాటర్​ రెసిస్టెన్స్​ సపోర్ట్​ ఉండగా.. కొత్తగా లాంచ్​ అయిన ఐఓఎస్​ 17 సాఫ్ట్​వేర్​ సపోర్ట్​ ఈ మోడల్‌కు లభిస్తుండడం విశేషం.